»   » ఆయనతో సహజీవనం చేస్తున్నా.. ట్వీట్ చేసి షాకిచ్చిన నయనతార..

ఆయనతో సహజీవనం చేస్తున్నా.. ట్వీట్ చేసి షాకిచ్చిన నయనతార..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో అటు గ్లామర్ తో... ఇటు రూమర్లతో ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? అని సగటు సినీ ప్రేక్షకుడిని అడిగితే... అతడి నుంచి చటుక్కున జవాబు వచ్చే పేరు నయనతార. తాజాగా తమిళ ఫిల్మ్ మేకర్ విఘ్నేష్ శివన్ తో నయనతార సహజీవనం చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవి పుకార్లు కాదు నిజమే అంటూ నయన తన అభిమానులకు జస్ట్ క్లారిటీ ఇచ్చింది.

అభిమానులు షాక్...

అభిమానులు షాక్...

విఘ్నేష్ శివన్ తో ఈ అమ్మడు చెట్టాపట్టాలు వేసుకుని న్యూయార్క్ నగరంలో కలియ తిరిగింది. అందుకు సంబంధించి వారిద్దరు కలిసి దిగిన ఫోటోను నయనతార తన ట్విట్టర్ లో ఫోస్ట్ చేసింది. అంతేకాకుండా అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ఫోటో కింద మెసేజ్ పెట్టింది. దాదాపు అరున్నర లక్షల మంది ఆమె అభిమానులు ఆ ఫోటోను చూసి షాక్ అయ్యారు.

కోలివుడ్ లో చర్చనీయాంశం...

ఆ చిరునవ్వు చూస్తే అంతా సంతోషమే కనిపిస్తుంది.. హ్యాపీ బర్త్ డే టూ విఘ్నేష్ శివన్ అని నయనతార ట్విట్ చేసింది. తమ మధ్య ఉన్న అన్యోన్యత, ప్రేమను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. నయనతార చేసిన ట్విట్.. కోలివుడ్ లో చర్చనీయాంశమైంది.

శివన్ కు మంచి పేరు...

శివన్ కు మంచి పేరు...

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి దర్శకుడిగా, పాటల రచయితగా, నటుడుగా విఘ్నేష్ శివన్ కు మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే. అతడి దర్శకత్వంలో హీరోలు సూర్య, అతడి తమ్ముడు కార్తీ తన్నా సెర్నద కుట్టాం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్నది.

ప్రభు దేవాతో

ప్రభు దేవాతో

గతంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభు దేవాతో ఆమె ప్రేమ వ్యవహారం... పెళ్లి దాక వచ్చి ఆగిపోయింది. అలాగే తమిళ నటుడు శింభుతో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. తాజాగా విఘ్నేష్ శివన్ తో ఈ అందాల ఆట బొమ్మ చెక్కేర్లు కోడుతోంది అంటూ దక్షిణాదిన పుకార్లు గుప్పుమన్నాయి.

అభిమానులు క్లారిటీగా లేరు..

అభిమానులు క్లారిటీగా లేరు..

కాగా గతంలో సింగపూర్ లో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్ లో నయన, విఘ్నేష్ మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో వారి విషయం గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే విఘ్నేష్ శివన్ తో అయినా ఆమె పెళ్లి పీటలు ఎక్కుతుందా లేదా అనే విషయంలో మాత్రం నయనతార అభిమానులు క్లారిటీగా లేరు.

అన్ని సూపర్ డూపర్ హిట్లే...

అన్ని సూపర్ డూపర్ హిట్లే...

దక్షిణాదిలో ఆమె నటించిన అన్ని చిత్రాలు సూపర్ డూపర్ హిట్ లే. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె నటించిన సంగతి తెలసిందే. దక్షిణాదిలోని బీజీ తారల్లో నయన ఒకరిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె నటించిన అరమ్ చిత్రం త్వరలో విడుదల కానుంది. అలాగే మరో ఎనిమిది నెలల్లో ఆమె నటించిన మరో నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి.

English summary
Southern actor Nayanthara has responded to the rumours of dating Tamil filmmaker Vignesh Shivan. A Twitter handle named NayantharaU, which has more than 6,42,000 followers, has posted a photo in which she can be seen with Shivan at a spot in New York. The director is tagged in the tweet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu