నీ ప్రియుడే, మాకు తెలుసు... దాక్కోవడం ఎందుకు? నయనతార ఫోటోపై నెటిజన్లు!

By Bojja Kumar

హీరోయిన్ నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ విషయాన్ని వారు అఫీషియల్‌గా ప్రకటించక పోయినా సోషల్ మీడియాలో వారి పోస్టులు, ఇద్దరూ కలిసి విదేశీ ట్రిప్పులకు వెళ్లడం లాంటి చేస్తూ మీడియాకు, అభిమానులకు తమ రిలేషన్ గురించి ఎప్పటి కప్పుడు క్లూ ఇస్తూనే ఉన్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఇటీవల క్రిస్మస్ వేడుకలను నయనతార తన ప్రియుడితో కలిసి జరురుపుకుంది.

ఫోటో షేర్ చేసిన విఘ్నేష్

ఫోటో షేర్ చేసిన విఘ్నేష్

తన ప్రియురాలు నయనతారతో కలిసి దిగిన సెల్పీ ఫోటోను విఘ్నేష్ శివన్ ట్విట్టర్లో పోస్టు చేశారు. అయితే ఈ ఫోటోలొ నయనతార తన ముఖం పూర్తిగా కనిపించకుండా దాక్కోవడం గమనార్హం. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మాకు తెలుసు... ఇంకా దాక్కోవడం ఎందుకు?

మాకు తెలుసు... ఇంకా దాక్కోవడం ఎందుకు?

విఘ్నేష్ శివన్ తో నీవు ప్రేమలో ఉన్నావని మాకు తెలుసు, వ్యవహారం ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా మొహం కనిపించకుండా దాక్కోవడం ఎందుకు? ఈ దాగుడు మూతలు ఆపి పెళ్లి చేసుకుంటే సంతోషిస్తాం.... అంటూ ఈ ఫోటోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

14 ఇయర్స్ ఆప్ నయనిజం

14 ఇయర్స్ ఆప్ నయనిజం

తను పోస్టు చేసిన ఫోటోతో పాటు న‌య‌న్‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు విఘ్నేష్. ఆమె కెరీర్లో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించాడు. న‌య‌న‌తార ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 14 ఏళ్లు గ‌డిచిన విష‌యాన్ని గుర్తు చేస్తూ #14YearsOfNayanism అంటూ విఘ్నేష్ శివన్ కామెంట్ చేశారు.

నయనతార మొదటి సినిమా

నయనతార మొదటి సినిమా

న‌య‌న‌తార మొద‌టి చిత్రం మ‌నసిన‌క్క‌రే 14 సంవత్సరాల క్రితం క్రిస్‌మ‌స్ రోజునే విడుద‌లైంది.

ప్రభుదేవతో విడిపోయిన తర్వాత

ప్రభుదేవతో విడిపోయిన తర్వాత

ప్రభుదేవాతో ప్రేమాయణం, సహజీవనం తర్వాత అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్న నయనతార తర్వాత పలు కారణాలతో అతడితో విబేధించి విడిపోయిన సంగతి తెలిసిందే. కొంతకాలం ఒంటరిగా ఉన్న నయనతార... విఘ్నేష్ శివన్‌తో ఓ సినిమాకు పని చేసింది. ఈ క్రమంలో అతడితో ప్రేమలో పడింది.

ఫోటోలు షేర్ చేస్తున్న జంట

ఫోటోలు షేర్ చేస్తున్న జంట

నయనతార, విఘ్నేష్ శివన్ ఓపెన్ గానే రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. ఇద్దరూ కలిసి వెళ్లిన హాలీడే ట్రిప్ ఫోటోలను కూడా వీరు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు.

పెళ్లి, కాపురం అంటూ వార్తలు

పెళ్లి, కాపురం అంటూ వార్తలు

ఇద్దరూ త్వరలో రహస్య వివాహానికి ప్లాన్ చేసుకుంటున్నారని, వివాహం తర్వాత చెన్నైలో వారు కొత్తగా కొనుగోలు చేసిన లగ్జరీ విల్లాలో కాపురం పెట్టబోతున్నారని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

తెలుగులో నయనతార చేస్తున్న సినిమాలు

తెలుగులో నయనతార చేస్తున్న సినిమాలు

నయనతార ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న 102వ సినిమాకాగా, మరొకటి త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రారంభం కాబోతున్న ‘సై రా... నరసింహారెడ్డి'.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X