»   » రజనీకాంత్, శంకర్ ల 'రోబో' ఎంతదాకా వచ్చింది?

రజనీకాంత్, శంకర్ ల 'రోబో' ఎంతదాకా వచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రెడీ అవుతున్న రోబో చిత్రం గురించి తన బ్లాగ్ లో రాసారు. ఆయన రాసిన దాంట్లో రోబో చిత్రం టాకీ పార్ట్ పూర్తయిందన్నారు. అలాగే ఆడియో, చిత్రం రిలీజ్ గురించి చెబుతూ ఓ పాట బ్యాలెన్స్ ఉందన్నారు. త్వరలోనే ఆ సాంగ్ పూర్తి చేసి షూటింగ్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఆడియో విడుదల తేది ఈ షూటింగ్ పూర్తయన తర్వాత ఫైనలైజ్ అవుతుందన్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం కంప్యూటర్ గ్రాఫిక్స్ పూర్తయ్యా అన్నారు. అయితే కొంత సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉందన్నారు. ఫైనల్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, డబ్బింగ్ పూర్తయ్యాయని రాసుకొచ్చారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అయ్యేది, చిత్రంలో విశేషాలు, స్పెషాలిటీస్ ఏమిటన్నది మాత్రం రాయలేదు. ఇక రజనీకాంత్, శంకర్, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతోంది. ఇందులో రజనీ ద్వి పాత్రాభినయం చేస్తున్నట్లు చెప్తున్నారు. ఆ పాత్రలు సైంటిస్టు, రోబో అని వినిపిస్తోంది. ఇక ఇంతకుముందు రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీ సూపర్ హిట్ అవటంతో ఈ చిత్రం ఎఫెక్ట్ ట్రేడ్ లో బాగా ఉండే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu