For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏంటీ..? ఆడుకుంటున్నారా??: 2.0 రిలీజ్ పై నిర్మాతల అసహనం

  |
  Delay In Rajinikanth's 2.0 Realese ఓ క్లారిటీ ఇవ్వండి ప్లీజ్

  సినిమా ఇండస్ట్రీ లో పైకి కనిపించే అంశాలు వేరూ ఒక సినిమా బయటికి రావాలంటే ఉండే కష్టం వేరు. ఒక్క సినిమాని బయటికి తేవటానికి నిర్మాత పడేకష్టాలు ఎన్నో ఇప్పటివరకూ సగం మంది సినిమా వాళ్ళకే తెలియదు. మొన్నటికి మొన్న గరుడ వేగ విషయం లో మూడు కోట్ల ఫైనాన్స్ ష్యూరిటీ కింద హీరో రాజశేఖర్ తన సొంత ఫ్లాట్ తాకట్టు పెట్టాల్సి వచ్చిందట, అంతే కాదు గతం లో మరో సినిమా విషయం లో దర్శకుడు శ్రీనూ వైట్ల తన ఫ్లాట్ ని అమ్ముకున్నారన్న వార్తలూ వచ్చాయ్.

   ఏ నిర్మాతా సాహసించడు

  ఏ నిర్మాతా సాహసించడు

  నిజానికి నిర్మాతల శక్తికి మించి బడ్జెట్ చేతులు దాటిపోయినప్పుడు ఆ భారం సినిమాని బయటికి తీసుకు రావలనుకున్న దర్శకుడి మీదో, హీరో మీదో పడుతూనే ఉంటుంది. ఇదొక రకమైన జూదం. సాధారణం గా భారీ అంచనాలున్న సినిమాకి పోటీ గా తమ సినిమాని తేవటానికి ఏ నిర్మాతా సాహసించడు. పెద్ద సినిమాల మేకర్స్ ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించేది ఇందుకే. ఆ తేదీని బట్టి మిగతా నిర్మాతలు తమ రిలీజ్ ఎప్పుడు ఉండాలన్నది ప్లాన్ చేసుకుంటారు.

  శ్రీమంతుడు తప్ప

  శ్రీమంతుడు తప్ప

  బాహుబలి లాంటి మెగా సినిమా వచ్చినప్పుడు ఇదే జరిగింది. ఒక్క శ్రీమంతుడు తప్ప ఆ సమయం లో పెద్ద హిట్ కొట్టిన సినిమాలు లేవు. ఆ సినిమా దెబ్బకి చాలా సినిమాలు కొట్టుకు పోతాయని ఊహించిన విశ్లేషకుల అభిప్రాయాలని బట్టి రెండో సారి వచ్చిన బాహుబలి 2 సమయం లో తమ సినిమాలని కొంచం ముందో వెనకో ప్లాన్ చేసుకున్నారు మిగతా నిర్మాతలు.

  "బాహుబలి" తర్వాత

  అయితే ఇప్పుడు మాత్రం "బాహుబలి" తర్వాత అంతటి అంచనాలున్న సినిమా ‘2.0' రిలీజ్ విషయంలో మాత్రం ఆ విషయన్ని పట్టించుకోవటం లేదు. అసలు ఏ సమయం లో విడుదల అన్న విషయం లో ఆ చిత్ర నిర్మాతలు మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. ముందు దీపావళి విడుదల అని చెప్పి.. ఆ తర్వాత జనవరి 25కు వాయిదా వేశారు నిర్మాతలు.

  ఏప్రిల్ 13న తమిళ సంవత్సరాది

  ఏప్రిల్ 13న తమిళ సంవత్సరాది

  ఆ డేట్ పక్కా అనుకుంటుండగా వారం కిందట ఈ చిత్రం వేసవికి వాయిదా పడిందని వార్తలొచ్చాయి. ఏప్రిల్ 13న తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లుగా చెప్పుకున్నారు. దీంత ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ డేట్ పక్కా అయితే.. ఏప్రిల్‌కు షెడ్యూల్ అయిన సినిమాల డేట్లన్నీ మార్చుకోవాలి.

   నిర్మాతల్లో గందరగోళం మొదలైంది

  నిర్మాతల్లో గందరగోళం మొదలైంది

  జనవరి సినిమాల్లోనూ మార్పులుంటాయి. దీంతో ఇటు తెలుగులో.. అటు తమిళంలో నిర్మాతల్లో గందరగోళం మొదలైంది. ఐతే ‘2.0' వాయిదా పడిందా లేదా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. నిర్మాతలు తమకేమీ పట్టనట్లు సైలెంటుగా ఉన్నారు. ఒకవేళ వాయిదా లేకుంటే.. ఆ విషయం స్పష్టం చేయాలి.

   ఆ విషయాన్ని ధ్రువీకరించాలి

  ఆ విషయాన్ని ధ్రువీకరించాలి

  ఒక వేళ రిలీజ్ డేట్ మారుతుంటే.. ఆ విషయాన్ని ధ్రువీకరించాలి. కానీ వాళ్లు మాత్రం ఏమీ స్పందించట్లేదు. మరోవైపు వేరే నిర్మాతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మరి ఇంకెన్నాళ్లు ‘2.0' మేకర్స్ సైలెంటుగా ఉంటారో? ఇప్పటికే కోలీవుడ్ నిర్మాతల్లో అసహనం పెరిగిపోతోందట.

   అది అసాధ్యం..

  అది అసాధ్యం..

  తమ సినిమాలని ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలో అర్థం కావటం లేదట. 2.0 కోసం వారాల తరబడి వెయిట్ చేయటం అంటే చేజేతులా ఫైనాన్సర్లతో తలమీద చేతులు పెట్టించుకున్నట్టే. అలా అని ముందే రిలీజ్ చేయాలంటే షెడ్యూల్ ప్రకారం అనుకున్న పనులన్నీ పూర్తి చేయాలి, డేట్లూ, ముందే అనుకున్న ప్లాన్ లూ అన్నీ మార్చటం అంటే అది అసాధ్యం...

  టాలీవుడ్ ని కూడా పీడిస్తోంది

  టాలీవుడ్ ని కూడా పీడిస్తోంది

  ఈ సమస్య కోలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ ని కూడా పీడిస్తోంది. రజినీకాంత్ అన్నా, శంకర్ సినిమా అన్నా తెలుగులో కూడా స్ట్రైట్ సినిమాకున్నంత క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా తమిళనాడు పరిస్తితే తలెత్తుతుంది. కానీ ఈ విషయాన్ని 2.0 టీమ్ పట్టించుకున్నట్టే లేదు ఇష్టాను సారం డేట్ ఇస్తూ, మళ్ళీ తూచ్ ఇది కాదు అంటూ అసలు సినిమా ఎప్పుడూ అన్నది అర్థం కానంత అయోమయానికి గురి చేస్తున్నారు.

  English summary
  2.0 is said to be the costliest Indian film and it has been made on a budget of Rs 400 crores. The makers are announcing Release dates and poastponed it.. and Still they have No Clarity About 2Point0 Release Date For Producers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X