twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెకండ్ షోలు రద్దు చేసారు

    By Srikanya
    |

    ఇంతకుముందు బెంగుళూరులో సినిమాలు సెకండ్ షోలు తీసి వేసారు. ఇప్పుడదే రూల్ ని తమిళ చిత్ర పరిశ్రమ కూడా పాటించటానికి సిద్దమైంది. తమిళనాడు ధియోటర్స్ అసోషియేషన్ ప్రెసెడెంట్ అభిరామి రామనాధన్ ఈ మేరకు ఓ ప్రకటన చేసారు. ఇక నుంచి కేవలం సెకండ్ షోలు అనేవి వేయబడవని, షో టైమ్స్ ను ముందుకు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఉదయం పదిగంటలకు, తర్వాత ఒంటి గంటకు, మూడు గంటలకు, ఆరు గంటలకు షోలు పడతాయి. సాయింత్రం ఆరు గంటలు షోనే ఆఖరి షో. ఇక బెంగుళూరులో ఇలాంటి సిస్టమ్ రన్ అవుతోందని ఆయన చెప్పారు.

    ఇక దీనికి కారణం చెప్తూ.. సెకండ్ షోలు వేయటం వల్ల చాలా థియేటర్స్ కు నష్టం వస్తోందని, చాలా సార్లు ఖాళీ థియేటర్స్ లోనే సినిమా వేయాల్సిన తప్పని సరి పరిస్ధితి వస్తోందని, కరెంట్ బిల్ లు కూడా రాని సంఘటనలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ సేప్టీని కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవటం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక పెద్ద సినిమాలు వరసగా ఫెయిల్యూర్ అవటం అక్కడ ఎగ్జిబిటర్స్ ని బాగా దెబ్బ తీసింది. మొన్న ఆర్బాటంగా విడుదలైన సెవెంత్ సెన్స్ చిత్రం కూడా చాలా నష్టాలు తెచ్చిందని సమాచారం. ఇక పండుగకు రాబోయే పెద్ద సినిమాలుపైనే అందరి అంచనాలు ఉన్నాయి. అయితే ముందుగానే ఇలాంటి నిర్ణయం తీసుకుని కొంతలో కొంత నష్టాన్ని పూడ్చుకోవాలని ఎగ్జిబిటర్స్ నిర్ణయించుకునే ఈ ప్రకటన చేసినట్లు చెప్పుకుంటున్నారు.

    English summary
    Tamilnadu is likely to see where there would be no second show screening of the films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X