twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎమ్మెల్యేగా పా రంజిత్.. రాజకీయ ప్రవేశానికి రంగం సిద్దం.. జాతీయపార్టీ గ్రీన్ సిగ్నల్!

    |

    కబాలి, కాలా చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు పా రంజిత్‌ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శాసన సభ్యుడిగా పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    వామపక్ష భావాలతో పా రంజిత్

    వామపక్ష భావాలతో పా రంజిత్

    వాస్తవానికి పా రంజిత్ వామపక్ష భావాలున్న వ్యక్తిగా అందరికి సుపరితులు. తన చిత్రాల్లోను అలాంటి వాసనలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అంబేద్కరిజం, దళితవాదాన్ని తన చిత్రాల్లో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రస్తావిస్తుంటారు.

    కోజికోడ్ ఉత్తర స్థానం నుంచి

    కోజికోడ్ ఉత్తర స్థానం నుంచి

    ఆధునిక భావాలతో ముందుకెళ్తున్న పా రంజిత్ తన రాజకీయ ప్రవేశంపై సీపీఎం నాయకులతో చర్చలు జరిపినట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో కోజికోడ్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎల్‌డీఎఫ్ అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎల్‌డీఎఫ్ అభ్యర్థి ప్రదీప్ కుమార్ స్థానంలో పా రంజిత్ పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది.

    పా రంజిత్‌కు సీపీఎం హామీ

    పా రంజిత్‌కు సీపీఎం హామీ

    ఇప్పటికే సీపీఎం ఎమ్మెల్యేలు పా రంజిత్‌కు స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సమాచారం. దాంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలని రాజకీయ, సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    పా రంజిత్ కెరీర్ ఇలా

    పా రంజిత్ కెరీర్ ఇలా

    పా రంజిత్ కెరీర్‌ విషయానికి వస్తే.. ఆటకత్తితో దర్శకుడిగా పరిచయమైన యువ డైరెకట్టర్ మద్రాస్, కబాలి, కాలా చిత్రాలను రూపొందించారు. సర్పట్టా పరంబరై చిత్రం విడుదల కావాల్సి ఉంది. నిర్మాతగా పరియెరమ్ పెరుమల్, ఇంద్ర ఉలగపోరిన్ కడైసీ గుండు తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

    English summary
    Director Pa Ranjith to Contest in Kerala Elections as LDF Candidate in Kozhikode North constituency. Pa Rajnjith already made discussion, With the CPM leaders of Kerala. Soon This news out as official from the party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X