»   » నీరూ నిప్పూ, బావిపై ఇరు రాష్ట్రాల గొడవ: పదేళ్ల తర్వాత తెరపైకి జయప్రద

నీరూ నిప్పూ, బావిపై ఇరు రాష్ట్రాల గొడవ: పదేళ్ల తర్వాత తెరపైకి జయప్రద

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై‌: ప్రముఖ తెలుగు సినీ నటి జయప్రద మళ్లీ తెర మీద కనిపించనుంది. అయితే, ఆమె చేస్తున్నది తెలుగు సినిమా కాదు, తమిళం సినిమాలో. కేరళ, తమిళనాడు మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంగా ఈ సినిమా రూపొందనుంది. మలయాళ దర్శకుడు ఎంఎ నిషాద్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆ సినిమాకు కెని అనే పేరు కూడా పెట్టారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దులో ఉండే ఆ బావి విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం కెని సినిమా కథావస్తువు. ఈ సమస్యను ఎలా పరిష్కరించానే విషయాన్ని తెరపై చూపిస్తారు. 1956లో కేరళ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ వివాదం చోటు చేసుకుంది.

తమిళ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తీపన్ ఈ చిత్రంలో జయప్రద సరసన నటిస్తున్నాడు. జయప్రద పన్నెండేళ్ల వయస్సులోనే సినిమాల్లో నటించారు. ముప్పై రెండేళ్ల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చి సినిమాలకు దూరమయ్యారు.

మలయాళీ దర్శకుడైనా..

మలయాళీ దర్శకుడైనా..

ఓ మలయాళం దర్శకుడు తమిళుల పక్షాన సినిమా తీస్తుంటే తనకు నటించాలని అనిపించిందని పార్తీపన్ అన్నారు. ఇరు వర్గాలు కయ్యానికి కాలు దువ్వుతూ నిప్పును రాజేసుకుంటున్న సమయంలో గొడవ పడకుండా సమస్యను ఎలా పరిష్కరించవచ్చునో ఇరు వర్గాలకు అర్థం చేయించే పాత్రలో పార్తీపన్ నటిస్తున్నాడు.

 బావి ఉన్న గ్రామ స్త్రీగా జయప్రద....

బావి ఉన్న గ్రామ స్త్రీగా జయప్రద....

జయప్రద కెని సినిమాలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆమె పోషిస్తున్న పాత్ర ఊళ్లోనే వివాదానికి కారణమైన బావి ఉంటుంది. జయప్రద సరసన నటించడం సంతోషంగా ఉందని, పదేళ్ల క్రితం సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు జయప్రదతో కలిసి పనిచేశానని పార్తీపన్ అన్నారు.

PM Modi releases Rs 125 coin on birth anniversary of Dr S Radhakrishnan
హిందీ రీమేక్ సమయంలో....

హిందీ రీమేక్ సమయంలో....

తాను భాగ్యరాజా వద్ద పనిచేస్తున్నప్పుడు జయప్రదతో కలిసి పని చేసే అవకాశం లభించిందని పార్తీపన్ అన్నారు. భాగ్యరాజా ఒరు కైథియన్ డైరీ అనే సినిమాను ఆఖరీ రస్తా పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ సరసన జయప్రద నటించారు. ప్రస్తుతం ఆమె తన సహనటి కావడం గర్వంగా ఉందని పార్తీపన్ అన్నారు.

వారు కూడా...

వారు కూడా...

కెని సినిమాలో నాజర్, తలైవసల్ విజయ్ కూడా నటిస్తున్నారు. జయప్రద కమల్ హాసన్ దశావతారం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

English summary
Radhakrishnan Parthiban will be seen in a crucial role in an upcoming Tamil film Keni, which will have veteran actress Jayaprada returning to Tamil cinema after 10 years.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu