»   » తమిళనాట పవన్ కల్యాణ్ దీక్ష..సన్నాహాలు మొదలు

తమిళనాట పవన్ కల్యాణ్ దీక్ష..సన్నాహాలు మొదలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హోసూరు : నిర్బంధ తమిళ భాషా చట్టాన్ని వ్యతిరేకిస్తూ సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడులో దీక్ష చేపట్టనున్నారు. ఈ నెలాఖరున ఆయన చేపట్టే దీక్ష కోసం పవన్ అభిమానులు, తెలుగు భాషాభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిర్బంధ తమిళభాషా చట్టంతో ఈ రాష్ట్రంలో మైనార్టీ భాషలైన తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళం విద్యాభ్యాసానికి విద్యార్థులు దూరమైపోతున్నారని తమిళనాడు తెలుగు యువశక్తి, తెలుగు సాహిత్య పరిషత్ సంస్థలు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కూడా స్పందిస్తూ తమిళనాడులో దీక్ష చేపడతానని ప్రకటించారు.

తమిళనాడు ప్రభుత్వం 2006లో ప్రవేశపెట్టిన ‘నిర్బంధ తమిళం' జీవో కారణంగా మైనారిటీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునేందుకు అవకాశం లేకుండాపోయిన విషయం తెలిసిందే. తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేపట్టింది. ఇటీవల హైదరాబాద్‌లో నిరసన దీక్ష కూడా నిర్వహించింది.

Pawan Kalyan Dharna In Tamil Nadu

ఈ నేపథ్యంలో సమస్యపై పవన్‌ కళ్యాణ్ ఆరా తీసినట్లు సమాచారం. తమిళనాడులోని తెలుగువారికి సంఘీభావం తెలుపుతూ ఈ నెలాఖరులోపు హోసూరులో ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా తెలుగు భాషను పరిరక్షించాలన్న డిమాండ్‌తోనే నిరసనదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. అదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరో వైపు...ఈ చిత్రం కొత్త షెడ్యూల్ లో ఇగో క్లాషెష్ చోటు చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రానికి సనిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న జయనేని విన్సెంట్ తో దర్శకుడు బాబికి కొన్ని ఇగో క్లాషెష్, క్రియేటివ్ డిస్ట్రిబెన్సెలు చోటు చేసుకున్నాయని, దాంతో జయన్ విన్సెంట్ బయిటకు వచ్చేసారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.

అయితే ఈ విషయమై పవన్ మధ్యలో వేలు పెట్టలేదని, బాబి తనకు నచ్చిన కెమెరామెన్ ఆర్దర్ ఎ విల్స్ ని తీసుకువచ్చి మిగతా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే షూటింగ్ డిలే అవుతూ వస్తోందని అంటున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌.

English summary
Pawan Kalyan will take up dharna for the cause of Telugu language in Tamil Nadu. Pawan Kalyan has inquired about this. Conveying his support for Telugu-speaking people in Tamil Nadu, Pawan has decided to instigate dharna in Hosur by end of this month, as per reports.
Please Wait while comments are loading...