ఎక్సక్లూజివ్: ఇక్కడ పవన్, అక్కడ విజయ్, చర్చలు జరుగుతున్నాయి

By Srikanya

చెన్నై: ఇళయదళపతి విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'తేరీ'. ఈ చిత్రం గురించి వచ్చే ప్రతీ వార్తా ఇప్పుడు తమిళనాట క్రేజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా తమిళ సిని వర్గాల అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం పై పవన్ చాలా ఆసక్తి చూపుతున్నారని.

ఈ మేరకు ఆయన దర్శకుడుతో మాట్లాడారని, కథ కూడా తెలుసుకున్నారని, కొన్ని సన్నివేశాలు కూడా చూసారని వార్త. అయితే ఈ సినిమా రీమేక్ విషయమై ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదని, తెలుగులో ఓ యువ దర్శకుడుతో ఈ రీమేక్ చేయంచాలని నిర్ణయించుకున్నారని, రీమేక్ విషయమై మాట్లాడారని కూడా చెప్తున్నారు.

ఈ చిత్ర ఆడియోను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు హీరో విజయ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాద్వారా వెల్లడించారు.

మరో ప్రక్క ఇదే తేదీన పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియోని విడుదల చేయటానికి నిర్ణయం చేసారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలోనే వెన్యూ , పూర్తి వివరాలతో ప్రకటన రానుంది.

'తేరీ' ని వేసవి కానుకగా తేరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యీనిట్ ప్రయత్నాలు చేస్తోంది. విజయ్‌ సరసన సమంత, అమీ జాక్సన్‌లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. వి క్రియేషన్స్‌ బ్యానర్‌పై కలైపులి ఎస్‌.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X