»   » తమిళనటి ఆత్మహత్య... తలమీద గాయం తో.., కుళ్ళిపోయి... పలు అనుమానాలు

తమిళనటి ఆత్మహత్య... తలమీద గాయం తో.., కుళ్ళిపోయి... పలు అనుమానాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఒక్కొక్కరూ రాలిపోతున్నారు అవకాశాల్లేక కొందరు నిరాశతో జీవితం లో ఏర్పడ్డ శూన్యం తో డిప్రెషన్ లో కొందరు ఇలా ఏవేవో కారణాలతో తెలుగు సినీ పరిశ్రమ లోని నటులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కోరుకున్నది సాధించలేక పోయామన్న నిరాశతో పాటు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్ట గానే గొప్ప పేరూ డబ్బూ వస్తాయని ఆశపడి అవి సంపాదించలేకా, వేరే మార్గాల్లోకీ వెళ్లలేకా సతమతమౌతూ అర్థాంతరంగానే కన్నుమూస్తున్నారు. చెన్నై లో మరోనటి ఆత్మహత్యకు పాల్పడింది.సబర్ణ ఈమె మనకు పెద్దగా తెలిసుండకపోవచ్చు కానీ తమిళ ప్రేక్షకులకి మాత్రం చాలా దగ్గరగానే తెలుసు. ఎన్నో టీవీ సీరియళ్ళలో, రియాలిటీ షోలలో యాంకర్గానూ, పలు సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లలోనూ కనిపించిన ఈ పాతికెళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు రాలిపోయింది... రంగుల కలల్ని కనలేక ఆ కలలకోసం శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది...

  మొన్నటికి మొన్న విలక్షణ నటుడు రంగనాథ్ ఆత్మ హత్య మరో సారి సినీ నటుల ఆత్మ హత్యల వైపు అందరి చూపూ తిప్పింది. ఐతే రంగనాథ్ గారి విశయంలో ఆయన వ్యక్తి గత జీవితం లోని సమస్యపైకి కనబడుతున్నా. నిజానికి అవకాశాలు రాకపోవటం వల్ల, పనేమీ లేకపోవటం తో ఒంటరితన భావన ఎక్కువ కావటం వల్లనే అన్నది చాలామందికే అర్థమైన విశయం. ఆయన ౩౦౦కి పైగా చిత్రాలు, సీరియల్స్ లలో నటించి మంచి పేరు సంపాదించారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ షాక్ కి గురయింది. ఒక మంచి మనిషి... అజాత శతృవు... అలాంటి మనిషి ఇలా అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అంత పెద్ద నటుడికి సినీ పరిశ్రమ ఇచ్చిన గుర్తింపేమిటి చివరి రోజుల్లో ఆయన ఆ చిన్న ఫ్లాట్లో ఉంటూ ఆర్థికంగా చాలా కుంగిపోయారన్నది సన్నిహితులకు మాత్రమే తెలిసిన విశయం.

  ఆత్మ హత్య:

  ఆత్మ హత్య:

  యువహీరో ఉదయ్ కిరణ్ మరణించినప్పుడు. ఒక్కరోజు ముందైనా నాతో మాట్లాడి ఉంటే ఉదయ్ లో ధైర్యాన్ని పెంచి అతన్ని ఆత్మహత్య చేసుకోకుండా ఆపేవాన్ని అన్న రంగనాథ్ ఈ రోజు ఇలా ఆత్మ హత్యకు పాల్పడటం నిజంగా ధారుణమైన సంఘటనే. దీనికి కారణం ఎవరూ అని ప్రశ్నిస్తే... వేరే భాషల నటులను తెచ్చుకునే సినీ పరిశ్రమ రంగనాథ్ ని ఒక సినిమాలోకి తీసుకొని ఎన్నాళ్ళైందీ అనేది ఆలోచిస్తే చాలు మనకు సమాధానం దొరికి తీరుతుంది.

  ఉదయ్ కిరణ్:

  ఉదయ్ కిరణ్:

  ఇక ఉదయ్ కిరణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకునే చివరి నిమిషం లో దురదృష్టం కాటేసిన నటుడు. ఆత్మహత్యకు గల కారణాల విషయానికొస్తే... అవకాశాలు లేక పోవడం వల్లనే ఉదయ్ కిరణ్ మానసికంగా కృంగి పోయారని తెలుస్తోంది.అసలు ఉదయ్ కి అవకాశాలు ఎందుకు రాలేదూ అన్న సంగతి ఇండస్ట్రీ మొత్తం తెలుసు. కొంత కాలం చెన్నై వెళ్లి అక్కడ తమిళ సినిమాల్లో అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేసాడని.

  ఆత్మహత్యకు దారి:

  ఆత్మహత్యకు దారి:

  అయినా ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదని, కొందరైతే నువ్వెవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తించారని, దీంతో ఉదయ్ కిరణ్ తీవ్రంగా బాధపడేవాడని తెలుస్తోంది. అవకాశాలు లేక మానసికంగా కృంగి పోతున్న తనకు అయిన వారి ఓదార్పు లేక పోవడం, స్నేహితులు సన్నిహితులు కూడా ఆయనకు దూరంగా ఉండటం.........ఇలాంటి పరిణామాలెన్నో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు దారి తీసాయి.

  భరత్ ఆత్మహత్య:

  భరత్ ఆత్మహత్య:

  రంగనాథ్ గారి మరణ విషాదం నుంచి పూర్తిగా బయటపడకముందే మరో వర్థమాన కొరియో గ్రాఫర్ భరత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలే కారణం అంటూన్నా ఇండస్ట్రీ కెరీర్ లో వచ్చే ఒత్తిడీ,డిప్రెషన్ ల ప్రభావమూ లేకపోలేదు... కొద్దిరోజుల క్రితమే "చిన్నారి పెళ్ళికూతురు" ప్రత్యూష వి ఘటన ఎంత విషాదం లో ముంచెత్తిందో తెలియనిది కాదు..

  మంచి టాలెంట్ ఉన్నా:

  మంచి టాలెంట్ ఉన్నా:

  ఒకప్పుడు ఇలా ఆత్మహత్యలకు పాల్పడే వారిలో స్త్రీలూ అందులోనూ హీరోయిన్ అవుదామని వచ్చి కాలేకపోయిన వారూ ఉండేవారు. సిల్క్ స్మిత, అంతకు ముందు ఫటాఫట్ జయలక్ష్మీ,మొన్నటికి మొన్న జియాఖాన్ వంటి కొందరు మంచి టాలెంట్ ఉన్నా ఐటం ముద్ర వేసి వారికిచ్చే పారితోషికాలను కూడా భారీగా తగ్గించటంతో తమ సినీ గ్లామర్ కు తగ్గ "మేయింటెనెన్స్" కోసం విపరీతమైన అప్పులు చేసి చివరికి అవకాశాలూ, డబ్బూ రెండూ లేక ఆత్మహత్యలు చేసుకున్నారు.

  ఈ సంఘటనలన్నీ మర్చిపోకముందే:

  ఈ సంఘటనలన్నీ మర్చిపోకముందే:


  జియాఖాన్ విశయంలోనూ విపరీతమైన డిప్రెషన్, తన వ్యక్తిగత జీవితం లోని మరికొన్ని సమస్యలే ఆత్మ హత్యకి దారి తీసాయన్నది అందరికీ తెలిసిందే.., ఇదే సంఘతనని పోలిన ప్రత్యూష మరణం కూడా పెద్ద విషాదాన్నే కలిగించింది సిన్మాకంటే ఎక్కువమంది అభిమానులనే సంపాదించుకున్న "చిన్నారి పెళ్లికూతురు అలా చనిపోవటం... అదీ ఆత్మ హత్య చేసుకోవటం చాలామందినే బాదించింది.. ఈ సంఘటనలన్నీ మర్చిపోకముందే ఈపుడు మరో వార్త...

  సబర్ణ:

  సబర్ణ:

  చెన్నై లో మరోనటి ఆత్మహత్యకు పాల్పడింది.సబర్ణ ఈమె మనకు పెద్దగా తెలిసుండకపోవచ్చు కానీ తమిళ ప్రేక్షకులకి మాత్రం చాలా దగ్గరగానే తెలుసు. ఎన్నో టీవీ సీరియళ్ళలో, రియాలిటీ షోలలో యాంకర్గానూ, పలు సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లలోనూ కనిపించిన ఈ పాతికెళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు రాలిపోయింది... రంగుల కలల్ని కనలేక ఆ కలలకోసం శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది...

  దుర్వాసన రావడంతో:

  దుర్వాసన రావడంతో:

  నాలుగు రోజుల కిందటే ఇద్దరు కన్నడ నటులు షూటింగ్ సందర్భంగా ప్రాణాలు కోల్పోవడం దక్షిణాది సినీ పరిశ్రమను విస్మయానికి గురి చేసింది. ఇంతలో కోలీవుడ్లో ఓ నటి ఆత్మహత్య చేసుకుని అందరినీ షాక్ గురి చేసింది. టీవీ షోలతో మంచి పేరు సంపాదించి.. కొన్ని సినిమాల్లో కూడా నటించిన సబర్ణ చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని మధురవోయల్ ప్రాంతంలో ఉంటున్న సబర్ణ మూడు రోజులుగా కనిపించడం లేదు. దీంతో ఇరుగు పొరుగువారికి అనుమానం వచ్చింది. దీనికి తోడు ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

  దిగ్ర్భాంతి:

  దిగ్ర్భాంతి:

  పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా సబర్ణ ఉరి వేసుకుని కనిపించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినా.. సబర్ణది ఆత్మహత్యేనని భావిస్తున్నారు. ఆమె కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. సబర్ణ సూసైడ్ వ్యవహారం కోలీవుడ్‌ని దిగ్ర్భాంతికి గురిచేసింది.

  ఇంతలోపే :

  ఇంతలోపే :

  టీవీ ఛానెల్స్‌లో యాంకర్‌గా ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆపై సినిమాల్లోనూ అడపాదడపా క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చింది. కానీ ఇంతలోపే ఆమె ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం మాత్రం తెలియరాలేదు.ఐతే సబర్ణ చాలా ధైర్యవంతురాలని.. ఆమె ఇలా చేస్తుందని అనుకోలేదని ఓ ఫ్రెండ్ చెప్పింది.

  అనుమానాస్పద మృతి:

  అనుమానాస్పద మృతి:

  సన్ టీవీలో 'పసమలార్' అనే టీవీ సిరీస్ తో మంచి పేరు సంపాదించిన సబర్ణ చాలా టీవీ షోలు చేసింది. కలై, పదికదవన్, పిరివం సండీపం, పూజై... ఇలా చాలా సినిమాల్లోనే నటించింది . ఆమె ఆత్మహత్యకు కారణాలేంటో తెలియాల్సి ఉంది. సబర్ణ వయసు పాతికేళ్లే. ఇన్ని అనుమానాస్పద మృతికేసుల నడుమ సబర్ణ మరణం కూడా ఒక ఆత్న హత్య గానే నమోదు కావొచ్చుకానీ... దాని వెనుక ఉన్న నిజాల్లో ఖచ్చితంగా అవకాశాల లేమి , లేదంటే కోరుకున్నంత సంపాదనా అనేవి ఖచ్చితంగా ఆ కారణాల్లో ఉంటాయని మనకూ తెలుసు...

  English summary
  Popular Television and Movie actress Sabarna Anand committed suicide in her apartment near Maduravoyal in Chennai. She acted many Tamil movies including Kalai, Padikadhavan, Pirivom Sandipom, Poojai.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more