»   » 'రమాలత చట్టబద్దంగా నా భార్య కాదు' ప్రభుదేవా కొత్త ప్లాన్

'రమాలత చట్టబద్దంగా నా భార్య కాదు' ప్రభుదేవా కొత్త ప్లాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నయనతారతో ఎఫైర్ సాగిస్తున్న ప్రభుదేవాకు తాళి కట్టిన భార్య రమలత నుంచి సమస్య ఎదురైన సంగతి తెలిసిందే. నయనతార నుంచి తన భర్తను విడిపించి అప్పగించాలని ఆమె చెన్నైలోని కుటుంబ సంక్షే మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ప్రభుదేవా, నయనతారల పెళ్లిని అడ్డుకోవాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. తనకు న్యాయం చేయమంటూ కోర్టుకు వెళ్ళటంతో...ప్రభుదేవా ఇప్పుడు అస్సలు ఆమె తన భార్యే కాదంటున్నాడు. తమ పెళ్ళి రిజిస్ట్రేషన్ జరగలేదని, అలాంటప్పుడు అది చట్ట సమ్మతమైన వివాహం కాదని చెప్తున్నాడు. అతని లాయర్లు కూడా అదే వాదనకు సిద్దపడుతున్నారు. ఈ నెల ఇరవై మూడవ తేదీన ఈ విషయం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో తీర్పుకు రానుంది. ఈ సమయంలో నయనతార, ప్రభుదేవా ఇద్దరూ హాజరు కావాల్సి ఉంది. ఇక ప్రభుదేవా తనకు అస్సలు పెళ్ళి కాలేదని వాదనకు రెడీ అవుతూంటే...భార్య రమలత తన ముగ్గురు బిడ్డల బర్త్ సర్టిఫికేట్స్, రేషన్ కార్డుని సబ్మిట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరో ప్రక్క రమలత తనను విడిచిపెడితే సెటిల్ చేస్తానంటూ బేరం పెట్టారు. ఈ వ్యవహారం సెటిల్ చేయమంటూ భార్య రమలత్ రాజీకొచ్చేలా చేయడానికి ఒక ప్రముఖ సినీ నిర్మాతను తన భార్య వద్ద కు పంపారని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu