For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన ప్రియ.. మోసపోయాను అంటూ పోస్ట్

  |

  తమిళ చిత్ర రంగంలో అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న ప్రియా భవానీ శంకర్ పర్సనల్ లైఫ్‌పై ఎన్నో రూమర్లు, గాసిప్స్ వస్తూనే ఉంటాయి. అయితే వాటిని పట్టించుకోకుండా తన కెరీర్ మీదే దృష్టిని పెట్టి ముందుకెళ్తున్నది. కానీ కొన్నేళ్లుగా తన బాయ్‌ఫ్రెండ్‌తో కొనసాగిస్తున్న ఆఫైర్‌కు మంగళం పాడిందనే వార్త చక్కర్లు కొడుతున్నది. అందుకు కారణం ఆమె వ్యవహరించిన తీరే అందుకు బలం, అనుమానాలను రేకెత్తిస్తున్నది. ప్రియా భవానీ ఏం చేశారంటే..

   చాలాకాలంగా డేటింగ్

  చాలాకాలంగా డేటింగ్

  ఇప్పుడిప్పుడే తమిళ సినిమాలో వర్థమాన తారగా గుర్తింపు తెచ్చుకొంటున్న ప్రియా భవానీ శంకర్‌కు చాలా కాలంగా అఫైర్ కొనసాగుతున్నది. రాజ్‌వేల్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు పొడసూపాయని, అందుకే అతడికి దూరంగా ఉంటుందనే వార్తలు ఈ మధ్య విస్తృతంగా ప్రచారమయ్యాయి.

   కొద్దికాలం క్రితం ఎమోషనల్ పోస్టు

  కొద్దికాలం క్రితం ఎమోషనల్ పోస్టు

  కొద్దికాలం క్రితం తన ప్రియుడు రాజ్‌వేల్ బర్త్ డే రోజున జనవరిలో భావోద్వేగమైన పోస్టును పెట్టారు. తన బాయ్‌ఫ్రెండ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఒకవేళ ఓ అమ్మాయికి నేను జన్మనిస్తే.. ఆ చిన్నారి తన బాయ్‌ఫ్రెండ్‌లా ఉండాలి అంటూ ప్రియా ఆసక్తికరమైన పోస్టులో తన భావాలను పంచుకొన్నారు.

  దేవుడు తిరస్కరించాడు

  దేవుడు తిరస్కరించాడు

  తమిళ ప్రజలు ఇష్టంగా పూజించే చిత్ర పౌర్ణమి రోజున ప్రియా భవానీ శంకర్ ఆసక్తికరమైన పోస్టును పెట్టింది. గతేడాది పెట్టిన ఆ పోస్టు ప్రకారం.. నేను ఇటీవల నాకు ఇష్టమైన తిరువన్నమలై ఆలయాన్ని సందర్శించుకొన్నాను. ఆ సందర్భంగా నాకు చాలా కోరికలున్నాయి దేవుడా. వాటిని తీర్చమని దరఖాస్తు చేసుకొన్నాను. అయితే నా దరఖాస్తును దేవుడు చింపి ముఖంపైన పడేశారు అని పోస్టులో పేర్కొన్నారు.

  బాయ్‌ఫ్రెండ్ పోస్టు డిలీట్

  బాయ్‌ఫ్రెండ్ పోస్టు డిలీట్

  ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రియా భవానీ శంకర్ తన ప్రియుడికి సంబంధించిన పోస్టును డిలీట్ చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది. అంతేకాకుండా మరో పోస్టులో ఒంటరితనం నాకు చాలా బాగుంది. సింగిల్ స్టేటస్‌ను ఆస్వాదిస్తున్నాను. ఇక ఇప్పట్లో నేను ఎవరితోను కలిసే ప్రసక్తి లేదు. కొత్త బంధానికి ఇప్పుడే ఆసక్తి చూపడం లేదని తన పోస్టులో పేర్కొన్నారు.

  నాకు మోసం జరిగిందంటూ

  నాకు మోసం జరిగిందంటూ

  అంతేకాకుండా తన ఇన్స్‌టాగ్రామ్‌లో తాజా పోస్టు ఇలాంటి అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. తన ఇంటి టెర్రస్‌పై చంద్రుడి ఎదుట నిలబడి తనకు జరిగిన మోసం, చేదు అనుభవాలను తలచుకొని బాధపడ్డారు. అయితే తనకు జరిగిన మోసం ఏమిటనే విషయాన్ని ప్రియా భవానీ శంకర్ క్లారిటీ ఇస్తే అసలు విషయాలు బయటకు వస్తాయనేది నెటిజన్ల అభిప్రాయం.

  #Tollywood : This Famous Director Lost A Chance To Direct The Pawan Kalyan Movie | Filmibeat Telugu
   ప్రియా భవానీ శంకర్ కెరీర్

  ప్రియా భవానీ శంకర్ కెరీర్

  ప్రియా భవానీ శంకర్ కెరీర్ విషయానికి వస్తే.. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన బ్యూటీ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇండియన్ 2, బొమ్మై, తెలుగులో ఘన విజయం సాధించిన పెళ్లిచూపులు రీమేక్, కురతి ఆట్టాం, కసాడా తప్పారా, కలైతిల్ సందిప్పొం అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

  English summary
  Priya Bhavani Shankar break up with Longtime Boyfriend Rajvel news goes viral in Tamil media. But no specific hint from tha actress priya. Priya Shankar recently deleted a post regarding her boy friend rises many eye brows.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X