»   » ప్రియా వారియర్ మ్యాజిక్.. మహేష్, రానాను దాటేసిన మలయాళీ భామ

ప్రియా వారియర్ మ్యాజిక్.. మహేష్, రానాను దాటేసిన మలయాళీ భామ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓవర్ నైట్‌లోనే యూట్యూబ్‌లో సంచలనంగా మారిన ప్రియా ప్రకాశ్ వారికర్ సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నది. మూడు రోజుల్లోనే సామాజిక మాధ్యమాల్లో సూపర్‌స్టార్లకు మించిన క్రేజ్ వచ్చింది. 11వ తేదీన విడుదలైన ఓరు ఆదార్ లవ్ చిత్రంలోని మాణిక్య మలరాయ పూవీ పాట ఇప్పటికే 10 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో రికార్డు స్థాయి ఫాలోవర్స్‌ను పెంచుకొని ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది ప్రియా వారియర్. సోషల్ మీడియాలో వివరాలు ఇవే..

 ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా

ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా

ఒకే ఒక్క పాటతో ప్రియా వారియర్ మ్యాజిక్ సృష్టించింది. కేవలం మూడు రోజుల్లో భారతీయ స్టార్లనే కాకుండా హాలీవుడ్ తారలను క్రేజ్ పరంగా అధిగమిస్తున్నది. సోషల్ మీడియాలో గత 24 గంటల్లో 60 లక్షల ఫాలోవర్స్‌ను ప్రియా వారియర్ పెంచుకొన్నది. హాలీవుడ్ తారల్లో కైలీ జెన్నెర్, క్రిస్టియన్ రొనాల్డో లాంటి తారలు ప్రియా ముందు వెలవెలపోయారు.

 దల్కర్ సల్మాన్‌ను మించి

దల్కర్ సల్మాన్‌ను మించి

మలయాళంలో సూపర్‌స్టార్లలో ఒకరైన దల్కర్ సల్మాన్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇన్స్‌టాగ్రామ్‌లో 19 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ప్రియా వారియర్ 29 లక్షల ఫాలోవర్స్‌తో మొదటి స్ఠానంలో ఉంది.

రానాను దాటేసిన ముద్దుగుమ్మ

రానాను దాటేసిన ముద్దుగుమ్మ

ఇక బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొన్న రానా దగ్గుబాటికి ఇన్స్‌టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన 20 లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో కొనసాగుతున్నారు. తాజాగా మాణిక్య మలరాయ పూవీ పాటతో రానాను కూడా ప్రియా వారియర్ అధిగమించడం గమనార్హం.

అనుష్కను మించిన ఫాలోవర్స్

అనుష్కను మించిన ఫాలోవర్స్

బాహుబలిలో దేవసేనగా, భాగమతి చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల్లో అనుష్క మంచి ఫాలోయింగ్ సంపాదించుకొన్నది. ఇన్స్‌టాగ్రామ్‌లో ఆమెకు 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అనుష్క ఫాలోవర్స్‌ను మంచి ప్రియా వారియర్ 29 లక్షల ఫాలోవర్స్‌ను సాధించింది.

వెనుకబడిన మహేష్‌ బాబు

వెనుకబడిన మహేష్‌ బాబు

ఇక ప్రిన్స్ మహేష్ బాబు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ కాకపోయినా అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి కనిపిస్తుంటాడు. ఆయన ఇటీవలే ఇన్స్‌టాగ్రామ్‌లో చేరి సుమారు 8 లక్షల ఫాలోవర్స్‌ను పెంచుకొన్నారు. ఇప్పుడు మహేష్ బాబును కూడా ప్రియా వారియర్ అధిగమించడం గమనార్హం.

English summary
witnessed the fastest growth on social media as she earned 605k followers in 24 hours. She almost beat Anushka, Mahesh, Rana, Kylie Jenner and Christian Ronaldo to it! As of today, Priya Prakash Varrier is a celebrity with 2.9 million followers on Instagram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu