»   » 'చెత్త కథలు..సిల్లీ సినిమాలు' కలవరపెడుతున్న ప్రియమణి కామెంట్స్

'చెత్త కథలు..సిల్లీ సినిమాలు' కలవరపెడుతున్న ప్రియమణి కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్యన రిలీజైన చాలా సినిమా కథలు వినటానికే చాలా సిల్లీగా ఉంటున్నాయి. అలాగే కథలు కూడా చెత్తగా ఉంటున్నాయి. ఈ మధ్యన మంచి వేషమంటూ కొందరు నిర్మాతలు వచ్చారు. అయితే వారి కథలు విన్నాక వాటిని ఎంత రెమ్యునేషన్ ఇచ్చినా ఒప్పుకోకూడదని ఫిక్సయ్యా" అంటోంది ప్రియమణి. అయితే ఈ మాటలు చెప్పేది ఆమె తమిళ సినిమాలను ఉద్దేశించి . దాంతో ఆమెపై తమిళులు మండిపడుతున్నారు. జాతీయ అవార్డు పొందిన పరుత్తి వీరన్ తమిళ చిత్రం కాదా అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే తెలుగు, కన్నడ,మళయాళ చిత్రాలు చేస్తున్న ఆమెకు తమిళంలో ఒక్క సినిమా కూడా లేదు. ఆ అక్కసుతోనే ఆమె ఇలా కామెంట్ చేసిందంటున్నారు. ఇక ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని నటించి న రక్త చరిత్ర చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రియమణి నటించిన రగడ చిత్రం త్వరలో రిలీజ్ కాబోతోంది. అలాగే వియన్ ఆదిత్య దర్శకత్వంలో సుమంత్ సరసన ఆమె చేసిన రాజ్ చిత్రం కూడా షూటింగ్ పూర్తయింది. వీటితో పాటు ఆమె క్షేత్రం అనే చిత్రంలోనూ చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu