»   » ఇంట్రడక్షన్ సాంగు కోసం 5.25 కోట్ల భారీ సెట్

ఇంట్రడక్షన్ సాంగు కోసం 5.25 కోట్ల భారీ సెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ గా శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై పి.టి సెల్వకుమార్ నిర్మిస్తున్న ‘పులి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చ ిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ గానీ, సినిమా స్టిల్స్ గానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర వియాలు తెలిసాయి. చెన్నయ్, కేరళలోని అందమైన ప్రేదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ఇపుడు తిరుపతి దగ్గర్లోని తలకోన ఫారెస్టుకి షిప్టయింది. దట్టమైన అడవి కావడంతో రోడ్డు సదుపాయం కూడా సరిగా లేదు. దీంతో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వని నిర్మాతలు, యూనిట్ సభ్యులు షూటింగ్ స్పాట్ కి వెళ్లడం కోసం రోడ్లు, ఉడెన్ బ్రిడ్జిలు నిర్మించారు.

ఈ ఫారెస్టులో 200 మంది కార్పెంటర్లు, 100 మంది మౌల్డర్స్, 50 మంది వెల్డర్స్ 100 రోజులు రాత్రింభవళ్లు కష్టపడి భారీ విలేజ్ సెట్ నిర్మించారు. నిజమైన విలేజ్ ని చూస్తున్నామా అని విలేజ్ సెట్ ని చూసిన యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ సెట్ లో మీరో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో విజయ్ తో పాటు శృతి హాసన్, ప్రభు, తంబి రామయ్య, సత్యన్, జూనియర్ బాలయ్య, నరేష్, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయిత్రి తదితరులు పాల్గొంటారు. ఈ పాటను శ్రీధర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు.

Puli movie Village set worth 5.25 crores

ఈ పాటను ఒక పండగ వాతావరణం తలపించేలా ఎంతో భారీగా చిత్రీకరిస్తున్నారు. ఇంకా ఈ ఇంట్రడక్షన్ సాంగులో 300 మంది జూనియర్ ఆర్టిస్టులు, ముంబై, చెన్నై, ఆంధ్రా, తెలంగాణ నుండి వచ్చిన 200 మంది డాన్సర్లు పాల్గొంటున్నారు. ఈ పాట కోసం 250 మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.

ఈ పాటను 5.25 కోట్లు బడ్జెట్ తో చిత్రీకరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు 118 కోట్లు రూపాయల భారీ బడ్జెట్ తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి ఏకధాటిగా ఈ రోజు 115వ రోజు షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత 25 రోజుల పాటు ఇండియాలోనే ముఖ్యమైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకుని 15 రోజుల పాటు విదేశాలలో షెడ్యూల్ చెయ్యడానికి ప్లాన్ చేసారు నిర్మాతలు.

విజయ్, శృతి హాసన్, హన్సిక, ఆలిండియా స్టార్ శ్రీదేవి, కన్నడ స్టార్ సుదీప్, ప్రభు, తంబి రామయ్య, సత్యన్, జూనియర్ బాలయ్య, నరేన్, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయిత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎస్.కె.టి స్టూడియోస్ బేనర్ పై శింబు దేవన్ దర్శకత్వంలో పి.టి.సెల్వకుమార్, శిబు నిర్మిస్తున్నారు.

English summary
Shooting of Vijay starrer Tamil film Puli is going on in full swing, and according to the latest update, a fancy village set worth 5.25 crores has been erected in the Talakona forest near Tirupathi. Reports reveal that Vijay’s introduction song will be shot in this set which will be a feast for all movie lovers.
Please Wait while comments are loading...