‘లెజెండ్’ హీరోయిన్ రాధిక ఆప్టేపై దాడి
హైదరాబాద్: ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రక్త చరిత్ర' సినిమాలో పరిటాల సునీత పాత్రలో....బాలీవుడ్ నటి రాధిక ఆప్టే నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బాలయ్య హీరోగా వచ్చిన 'లెజెండ్' చిత్రంలో కూడా నటించింది. తాజాగా రాధిక ఆప్టే గురించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో ఇండియా, పాకిస్థాన్ బోర్డర్లో షూటింగ్ జరుగుతుండగా ఆమెతో పాటు చిత్ర యూనిట్ పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. అజ్మల్, రాధికా ఆప్తే జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'వెట్రి సెల్వన్'. ఎస్.నాగరాజన్, కె.సురేష్ బాబులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రుద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ కాశ్మీర్‌లోని బెహర్‌గామ్, గాబామార్గ్, శ్రీనగర్ మొదలగు ప్రాంతాల్లో నిర్వహిస్తుండగా యూనిట్‌పై దాడి జరిగింది.

దాడి విషయాన్ని దర్శకుడు వివరిస్తూ...బెహల్‌గామ్‌లో నటి రాధిక ఆప్తే సన్నివేసాలు చిత్రీకరిస్తుండగా ఆ ప్రాంతానికి చెందిన వారు షూటింగ్‌ను వ్యతిరేకించారన్నారు. భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తున్నారేమిటి? అంటూ ఆగ్రహంతో యూనిట్‌పై దాడి చేశారని చెప్పారు.
దిక్కుతోచని పరిస్థితిలో ఆ ప్రాంతంలోని సిక్కులు తమను రక్షించి కారులో సురక్షితంగా పంపించారని వివరించారు. తాము ఇండియా సరిహద్దులోనే షూటింగ్ చేశామని, అయినా అక్కడి వాళ్లు పాకిస్తానీయుల మాదిరి గొడవపడి దాడికి పాల్పడ్డారని చెప్పారు.


Click it and Unblock the Notifications











