Raghava Lawrence Durga.. అఘోరాగా మారిపోయి, కళ్ళు తేలేసి, ఆశీర్వాదాలు కావాలట!

ఒక డ్యాన్సర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తర్వాత డైరెక్టర్ గా మారిన ఆయన తన డైరెక్షన్ స్కిల్స్ తో కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కేవలం తమిళంలో కాకుండా తెలుగులో కూడా దర్శకుడిగా సక్సెస్ అవుతూనే హీరోగా కూడా కనిపించారు. ఇక ఇప్పుడు హిందీలో కూడా లక్ష్మీ బాంబ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పటికే చాలా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న రాఘవ లారెన్స్ మరోసారి తనదైన శైలిలో అలరించడానికి సిద్దం అయ్యారు. కాంచన రీమేక్ తో బాలీవుడ్ లో డైరెక్టర్ గా లక్ష్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాఘవ లారెన్స్ ఈ మధ్యకాలంలో కాస్త సినిమాల విషయంలో గ్యాప్ తీసుకుంటున్నారు.

Raghava Lawrence

అయితే అనూహ్యంగా రాఘవ లారెన్స్ హీరోగా అసురన్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ అందిస్తున్న ఒక సినిమా ప్రకటన కొద్దిరోజుల క్రితం వెలువడింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ - స్క్రీన్ - ప్లే డైలాగ్స్ అందిస్తున్న అధికారం అనే సినిమాకి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. చాలా రోజులు వెట్రిమారన్ వద్ద దర్శకత్వ విభాగంలో అసోసియేట్ గా పని చేసిన సెంథిల్ గతంలో ధనుష్ 'కోడి' తెలుగులో ధర్మ యోగి పేరుతో రిలీజ్ అయింది. అలాగే పటాస్ అనే మరో సినిమాను కూడా ఆయన తెరకెక్కించారు. ఇక ఆ సినిమా తరువాత తన తదుపరి సినిమా ప్రకటించిన టాక్ ఆఫ్ ది సౌత్ ఇండస్ట్రీ గా మారిపోయారు లారెన్స్. రాఘవ లారెన్స్ నటించే తదుపరి సినిమాకు సంబంధించిన ప్రకటన కొద్ది సేపటి క్రితం బయటకు వచ్చింది. రాఘవ్ లారెన్స్ తన ట్విట్టర్ పేజీలో కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేసారు, ఈ పోస్టర్ లో సినిమా టైటిల్ 'దుర్గా' అని ప్రకటించబడింది.

Raghava Lawrence

అయితే ఈ చిత్రం పోస్టర్ ను విడుదల చేసిన లారెన్స్, ఆశీర్వాదం కావాలి అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో ఉన్న విచిత్రమైన లుక్ లో రాఘవ లారెన్స్ కనిపిస్తున్నారు. ఈ లుక్ లో ఆయన లుక్ లో ఆశ్చర్యం కలిగించింది. కళ్ళు పైకి చూసే ఒక అఘోరా పాత్రలో ఉన్న ఈ లుక్ చూపరులను ఆశ్చర్యపరిచింది. అది రాఘవేంద్ర ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు రాబోయే రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే , ఇది 'ముని' సిరీస్‌లో భాగం అవుతుందా అనే దానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి, అయితే అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. అయితే దెయ్యం, భూతం కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను ఇదివరకే ఆకట్టుకున్న లారెన్స్, ఈ చిత్రం లో ఎలాంటి సస్పెన్స్ చూపిస్తారో చూడాలి. ఇక రాఘవ లారెన్స్ ప్రస్తుతం 'రుద్రన్' లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కతిరేశన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జి వి ప్రకాష్ కుమార్ దీనికి సంగీతం సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X