పవన్ కళ్యాణ్ కాదు: నెక్ట్స్ మూవీ ప్రకటించిన లారెన్స్
హైదరాబాద్: కాంచన-2 (తెలుగులో ‘గంగ') చిత్రంతో హిట్టు కొట్టిన రాఘవ లారెన్స్.... చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన రాఘవ లారెన్స్ తో పాటు తాప్సీకి కూడా ఈ విజయం ఎంతో కీలకం అయింది. ఎందుకంటే ఇద్దరూ హిట్ రుచి చూసి చాలా కాలిం అయింది.
లారెన్స్ పని అయిపోయిందని అంతా అనుకున్న సయమంలో విజయం అందుకోవడం విశేషం. ఆ సంగతి పక్కన పెడితే ‘గంగ' విజయంతో ఉన్న లారెన్స్ తర్వాతి సినిమా పవన్ కళ్యాణ్‌తో చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని తేలి పోయింది.

తాజాగా లారెన్స్ తన తర్వాతి సినిమా అపీషియల్ గా ప్రకటించారు. ఈ చిత్రానికి లారెన్స్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వెందర్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
సినిమాకు నటీనటులు ఎవరూ ఖరారు కాలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ప్రకటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్టు 2015 నాటికి ఈ చిత్రం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











