For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  శ్రీరెడ్డిని చూస్తే జాలేస్తున్నది.. అవి పెట్టుకోవడానికి పిచ్చివాడినా.. ఆఫర్ ఇస్తా రా.. లారెన్స్

  By Rajababu
  |
  Actor Raghava Lawrence Talks About Sri Reddy

  తమిళ సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి చేస్తున్న వాఖ్యలు మీడియాలో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఆమె తనపై చేసిన ఆరోపణలపై నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ లారెన్స్ రాఘవ మరోసారి స్పందించారు. సినిమా అవకాశం ఇస్తానని చెప్పి నన్న శారీరకంగా వాడుకొన్నాడు అని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై కొద్దిరోజలు క్రితం స్పందించిన లారెన్స్.. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు.

  శ్రీరెడ్డి వివాదానికి ముగింపు

  శ్రీరెడ్డి వివాదానికి ముగింపు

  శ్రీరెడ్డి వివాదంపై లారెన్స్ రాఘవ మరోసారి స్పందించి మరోసారి తన వాదనను వినిపించారు. శ్రీరెడ్డి ఆరోపణల తర్వాత నాకు చాలా మంది నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఆమెతో వివాదం గురించి అడుగుతున్నారు. దాంతో ఆమెతో ఉన్న వివాదానికి ముగింపు పలకాలని అనుకొంటున్నాను అని రాఘవ పేర్కొన్నారు.

  రెబెల్ షూటింగ్‌లో కలిసింది

  రెబెల్ షూటింగ్‌లో కలిసింది

  తెలుగులో రెబెల్ సినిమా షూటింగ్ సమయంలో శ్రీరెడ్డి నన్ను కలిసింది. ఆ మూవీ పూర్తై ఇప్పటికీ 7 ఏళ్లు గడిచిపోయింది. అప్పటి నుంచి నాపై ఈ ఆరోపణలను ఆమె ఎందుకు చేయలేదు. హోటల్ రూమ్‌లో కలిసి తనతో అసభ్యంగా ప్రవర్తించానని చెప్పింది. అలాగే నా హోటల్ రూంలో రుద్రక్షమాల, దేవుడి ఫొటోలు చూశానని చెప్పింది. హోటల్లో రుద్రాక్ష మాలా ఉంచుకోవడం, పూజాలు చేయడానికి నేనేమైనా పిచ్చివాడినా అని లారెన్స్ అన్నారు.

  నా సినిమాలో అవకాశం ఇస్తా

  నా సినిమాలో అవకాశం ఇస్తా

  శ్రీరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తున్నది. ఇప్పటికీ నా సినిమాలో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకు ఓ ప్రెస్‌మీట్ పెడుతాను. మీడియా ముందు నీకు నేను ఓ కార్యెక్టర్, సీన్ పేపర్ ఇస్తాను. నీవు యాక్టింగ్‌తోపాటు కొన్ని నాతో స్టెప్పులు వేసి చూపించు. ఆమెకు నేను నాలా డ్యాన్స్ చేసే కష్టమైన స్టెప్పులు ఇవ్వను. ఆమెకు సింపుల్ స్టెప్స్ మాత్రమే ఇస్టాను అని లారెన్స్ పేర్కొన్నారు.

  టాలెంట్ ఉంటే

  టాలెంట్ ఉంటే

  నీలో నటనలో బేసిక్స్, టాలెంట్ ఉన్నదని భావిస్తే ఇంటే వెంటనే నా తదుపరి చిత్రంలో అవకాశం, అడ్వాన్స్ ఇస్తాను. ఒకవేళ నా సినిమాలో అవకాశం లభిస్తే ఆమెకు చాలా ఆఫర్లు రావడానికి అవకాశం ఉంటుంది అని లారెన్స్ అభిప్రాయపడ్డారు.

  అందరి ముందు వద్దనుకుంటే

  అందరి ముందు వద్దనుకుంటే

  ఒకవేళ ప్రెస్‌మీట్‌లో నీకు అందరి ముందు నటించడానికి ఇష్టం లేకపోతే నా మేనేజర్‌ను కలువండి. మీతోపాటు లాయర్‌ను లేదా మీ సన్నిహితులను తెచ్చుకొండి. మీ ప్రతిభను చాటుకొండి. నేను మీకు ఎలాంటి సహాయమైనా చేయడానికి సిద్ధం అని లారెన్స్ అన్నారు.

  శ్రీరెడ్డికి భయపడటం లేదు

  శ్రీరెడ్డికి భయపడటం లేదు

  శ్రీరెడ్డి చేసిన ఆరోపణలకు భయపడి ఈ సమాధానం ఇవ్వడం లేదు. ఎందుకంటే నేను మహిళలను గౌరవిస్తాను. నా తల్లి కోసం గుడి కట్టి దానిని మహిళలందరికీ అంకితం చేసిన వ్యక్తిని. మంచి పనులు చేయడం, మంచి మాట్లాడటమే నాకు తెలుసు. శ్రీరెడ్డి జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని లారెన్స్ చెప్పుకొచ్చారు.

  తమిళ ప్రముఖులపై శ్రీరెడ్డి

  తమిళ ప్రముఖులపై శ్రీరెడ్డి

  క్యాస్టింగ్ కౌచ్‌పై ఉద్యమిస్తున్నట్టు చెప్పుకొంటున్న శ్రీరెడ్డి ఇటీవల కాలంలో తమిళ చిత్ర ప్రముఖులపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. హీరో శ్రీకాంత్, ఏఆర్ మురుగదాస్, సుందర్ సీ లాంటి వారిని టార్గెట్ చేస్తూ ఆఫర్లు ఇస్తామని చెప్పి నన్ను వంచించారు అని శ్రీరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

  English summary
  Lawrence Raghava reacted on Sri Reddy allegations. He claimed that Sri Reddy was lying and is making baseless accusations. He said that he feels pity for her state and is willing to offer her a chance in his film - "We will do one thing I will keep a press meet. In front of the people, I will give you a character and scene to perform her talent and give you some dance steps to dance. He added, "As a director, if I really feel you have talent, I will sign a good character for you in my next movie and give an advance. if you feel bad to act in front of everyone then contact my manager, bring your lawyer, and well wisher with you and show your acting skills to me, and I will help you.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more