twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డాన్స్‌లో, దర్శకత్వంలో నేను జీరో.. బూతులు తిడితే ఊరుకోను.. లారెన్స్ సంచలనం!

    |

    Recommended Video

    Raghava Lawrence Lashes Out At Seeman || Filmibeat Telugu

    డాన్స్ కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, నటుడిగా రాఘవ లారెన్స్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. లారెన్స్ వివాదాలకు దూరంగా ఉంటాడు. పలు సేవ కార్యక్రమాలతో లారెన్స్ తన పెద్ద మనసు చాటుకుంటున్న సంగతి తెలిసిందే. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కాంచన 3. ఈ శుక్రవారం రోజు కాంచన 3 విడుదలవుతోంది. ఇటీవల కొంత కాలంగా ' నాన్ తమిళర్ కట్చి' పార్టీ చీఫ్ కన్వీనర్ అయిన సీమాన్, లారెన్స్ మధ్య వివాదం కొనసాగుతోంది. సీమాన్ పలు సందర్భాల్లో లారెన్స్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడు. దీనితో లారెన్స్ తాజాగా చాలా ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

    పబ్లిసిటీ కోసం

    పబ్లిసిటీ కోసం

    తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొని ఉంది. సీమాన్ ప్రచుర కార్యక్రమాల్లో పాల్గొంటూ లారెన్స్ పై విమర్శలు చేస్తున్నాడు. లారెన్స్ సేవ కార్యక్రమాల పేరుతో పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నాడని, అతడు ఎలాంటి సేవలు చేయడం లేదని సీమాన్ విమర్శించాడు. దీనితో వివాదం మొదలైంది. లారెన్స్ తాజాగా స్పందిస్తూ తన సేవ కార్యక్రమాల గురించి నీఛమైన కామెంట్స్ చేయడం సరికాదని తెలిపాడు.

    బూతులు మాట్లాడితే ఊరుకోను

    బూతులు మాట్లాడితే ఊరుకోను

    సీమాన్ వ్యాఖ్యలపై లారెన్స్ స్పందిస్తూ.. నువ్వు, మీ పార్టీ కార్యకర్తలు అనవసరంగా నాపై సభల్లో, సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మీరు చేస్తున్న అసభ్యమైన కామెంట్స్ తనని మానసికంగా బాధపెట్టాయని లారెన్స్ తెలిపాడు. నేను ఓ చారిటి కార్యక్రమంలో పాల్గొంటుండగా అక్కడకు మీ పార్టీ కార్యకర్తలు వచ్చి బూతులు మాట్లాడి వెళుతున్నారు. ఇలాంటి చర్యలని ఎక్కువ కాలం సహించలేను. చివరకు తన సంరక్షణలో ఉన్న దివ్యాంగులని కూడా మీ పార్టీ కార్యకర్తలు హింసించి వెళుతున్నారని లారెన్స్ మండిపడ్డాడు.

    నన్ను మాత్రమే టార్గెట్ చేస్తే ఓకే

    నన్ను మాత్రమే టార్గెట్ చేస్తే ఓకే

    మీకు కేవలం నన్ను మాత్రమే టార్గెట్ చేస్తే పర్వాలేదు. నేను మిమ్మల్ని ధీటుగా ఎదుర్కొంటాను. కానీ నా అభిమానులపై , అమాయకులపై దాడులకు దిగడం సరికాదు అని లారెన్స్ తెలిపాడు. మీరు నాపై వ్యాఖ్యలు చేసిన తర్వాతే ఇలాంటి సంఘటనలు మొదలవుతున్నాయని లారెన్స్ సీమాన్ కు తెలిపారు. నా గురించే మీరు మాట్లాడాలని అనుకుంటే ఇద్దరం కలసి ఓ చర్చలో పాల్గొందాం. ఎవరు ఏమేమి చేశారో అక్కడ తేల్చుకుందాం. కానీ ఇది సరైన పద్ధతి కాదని లారెన్స్ అన్నారు.

    ఒకప్పుడు నేను జీరో

    ఒకప్పుడు నేను జీరో

    ఒకప్పుడు తాను డాన్స్ లో జీరోని అని లారెన్స్ తెలిపారు. కానీ కష్టపడి ఆ కళని అందరిని మెప్పించే విధంగా నేర్చుకున్నా. దర్శకత్వంలో కూడా జీరోనే. అది కూడా నేర్చుకున్నా. ప్రస్తుతం తాను రాజకీయాల్లో జీరోని అని లారెన్స్ తెలిపాడు. రాజకీయాలు గురించి నాకు ఏమీ తెలియదు. ఇలా నన్ను అనవసరంగా టార్గెట్ చేస్తూ రాజకీయం కూడా నేర్చుకునేలా చేయవద్దు అంటూ సీమాన్ కు లారెన్స్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు. అవసరమైతే తాను రాజకీయాల్లో కూడా హీరోని కాగలనని లారెన్స్ తెలిపాడు.

    నాకు ఫోన్ చెయ్

    నాకు ఫోన్ చెయ్

    నేను మాట్లాడింది సరైనదే అని అనిపిస్తే నాకు ఫోన్ చెయ్. సమస్యని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. ఇది ఎన్నికల సమయం. కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకున్నా. చర్చల ద్వారా ప్రశాంత వాతావరణంలో సమస్యని పరిష్కరించుకుని మన పనులు మనం చేసుకుందాం అని లారెన్స్ సూచించారు. ఇదిలా ఉండగా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంచన సిరీస్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. కాంచన 3 కూడా మంచి విజయం సాధిస్తుందనే ధీమాతో లారెన్స్ ఉన్నాడు.

    English summary
    Raghava Lawrence warns Seeman in a lengthy cautionary note. Raghava Lawrence decided to hit back but made sure of not mentioning Naam Thamizhar Katchi chief Seeman's name in his long Facebook post
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X