»   »  పవన్ కల్యాణ్ గెటప్ లో రజినీకాంత్

పవన్ కల్యాణ్ గెటప్ లో రజినీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kathanayakudu
ఇప్పడు ఎక్కడ చూసినా కమల్ 'దశావతారం' గురించే ...అందులోని గెటప్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అందులో కమల్ పది గెటప్స్ లో కనపడితే...ఇప్పుడు రజనీకాంత్ 'కథానాయకుడు'లో ఒక పాటలో 20 భిన్నమైన గెటప్పులలో ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు. ఈ పాటని రజనీకాంత్, నయనతారలపై చిత్రీకరించారు. ఈ 20 గెటప్పులలో ఎక్కువగా ఆయన మునుపటి సూపర్‌హిట్ సినిమాలలో ధరించిన పాత్రలవే. వీటితో పాటు ఆయన పవన్ కల్యాణ్ గెటప్‌లోనూ దర్శనమివ్వనున్నారు. 'జల్సా'లో పవన్ ఎలా కనిపిస్తాడో, ఆ గెటప్‌ని రజనీ వేశారని తెలుస్తోంది. అంటే పవన్ పవర్ చెన్నైదాకా చేరిందన్నమాట అని అభిమానులు ఆనందపడుతున్నారు. ఇక కథానాయకుడు ఆడియోనీ జూన్ 30న ,సినిమానీ జూలై 18 లేదా 25న విడుదల చేయడానికి నిర్మాత చలసాని అశ్వనీదత్ సన్నాహాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X