»   » మరో రికార్డు బ్రద్దలు కొట్టిన రజనీకాంత్ 'రోబో'

మరో రికార్డు బ్రద్దలు కొట్టిన రజనీకాంత్ 'రోబో'

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రోబో చిత్రం ప్రారంభంనుంచీ ప్రతీ విషయంలోనూ ఏదో ఒక రికార్డు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం పాటల డౌన్ లోడ్స్ లో మరో రికార్డు నమోదు అయింది. ఈ పాటల ఐ ట్యూన్స్ లీగల్ డౌన్ లోడ్స్ ఇప్పటి వరకూ ఉన్న మార్కెట్ కి డబ్బై శాతం రీచయిందిని చెప్తున్నారు. ఇప్పటివరకూ ఇంటర్నెట్..ఐట్యూన్ మ్యూజిక్ ఛార్ట్ లలో ఇదే రికార్డు. ఓ ఇండియన్ పాట..ఇంత భారీ స్ధాయిలో డౌన్ లోడ్స్ చేసుకోవటం అదీ ఆడియో రిలీజైన నాలుగు రోజుల్లోనే అని ఆ సంస్ధ వారు ప్రకటన చేసారు. ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా చేసిన ఈ రోబో చిత్రం సైన్స్ ఫిక్షన్ గా భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. అలాగే ఆస్కార్ విజేత ఎఆర్ రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu