»   » రజనీ 'కబాలి' : రిలీజ్ డేట్ ఎప్పుడంటే....

రజనీ 'కబాలి' : రిలీజ్ డేట్ ఎప్పుడంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కబాలి' ఫస్ట్ లుక్ మొన్న వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేసారు దర్శక,నిర్మాతలు. ఈ చిత్రం రిలీజ్ ని తమిళ న్యూ ఇయర్ అయిన ఏప్రియల్ 14న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు రజనీకాంత్ తో చర్చిస్తున్నట్లు తెలుస్ోతంది.

ఆ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ఇక్కడ చూడండి.

ఇక ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రజనీ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తొలి షూటింగ్‌ పనులు మలేషియాలో జరుగుతున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అదే పోస్టర్ ఇంగ్లీష్ లో చూడండి.,...

సెప్టెంబరు నెలలో షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు చిత్రం బృందం వివరించింది.ఈ చిత్రం ఫొటో షూట్‌ పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను తమిళనాట అభిమానులు విపరీతంగా ఇష్టపడతారు. వయస్సు మీద పడినా తన అభిమాన నటుడిని యువకుడిగానే భావిస్తున్నారు.

రజనీ కొత్తగా నటించనున్న చిత్రం 'కపాలి'. ఈ చిత్రంలో రజనీ ఏ గెటప్‌లో నటిస్తారో తెలియక ఒకొక్కరు ఒక్కో విధమైన స్త్టెల్‌ చిత్రాలను వెబ్‌సైట్లలో ఉంచుతున్నారు. ఈ విధంగా రూపొందించిన పోస్టర్లలో చాలావరకు రజనీకాంత్‌ తెలుపు గడ్డంతోనే కనిపిస్తారంటూ వూహా చిత్రాలు రూపొందించారు. ఈ తరహా గెటప్‌లో కనిపించాలనేదే తమ కోరికగా చెబుతున్నారు. గతంలో రజనీకాంత్‌ 'ధర్మదురై' చిత్రంలో కనిపించిన గెటప్‌లోనే ప్రస్తుత కపాలీ చిత్రంలో కూడా కనిపించాలనేది అనేక మంది కోరికగా చెబుతున్నారు.

చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు. సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు. దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది.

కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు. అక్కడ కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు. వారంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు. సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.

 Rajini's Kabali on April 14?

ఆరవాన్ లో నటించిన దన్సిక ఈ చిత్రంలో డ్రగ్ ఎడిక్ట్ గా కనపడనుందని సమాచారం. ఆమె రజనీకుమార్తె. దన్సిక మాట్లాడుతూ... దన్సిక మాట్లాడుతూ తను కబాలి చిత్రంలో చేస్తున్నానని, రజనీ తో చేయటం చాలా ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు. అలాగే దర్శకుడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తండ్రి గజరాజు..ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు.

తన ఇమేజ్ ని పట్టించుకోకుండా కథలో ఏమైతే మార్పులో చెయ్యవచ్చో అవన్నీ చేయమని రజనీ..దర్శకుడుకి సూచించినట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన 'ఫ్యాన్స్‌మేడ్‌' ఫొటోలు, పోస్టర్లు మరింత ఆసక్తికరంగా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పలురకాల పోస్టర్లు కనిపించగా.. తాజాగా రజనీకాంత్‌ ఒరిజినల్‌ రూపురేఖలతో ఉన్న చిత్ర పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.

English summary
According to sources, Rajinikanth's ongoing Kabali movie will be hitting the screens on April 14, Tamil New Year. While the shooting for Rajinikanth starrer 'Kabali' is set to kick start on the auspicious day of Vinayagar Chathurthi on September 17, the first look the Superstar is released. Directed by Pa. Ranjith, the film chronicles the story of a don, played by Rajinikanth. Produced by Kalaipuli S Thanu, the movie also stars Kalaiarasan, Dinesh, Radhika Apte and Dhansika in the lead roles. Santhosh Naraynan will be scoring music for this film.
Please Wait while comments are loading...