»   » 17 ఏళ్ల తర్వాత రజనీకాంత్ మళ్లీ అలా...

17 ఏళ్ల తర్వాత రజనీకాంత్ మళ్లీ అలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న '2.0' చిత్రానికి సంబంధించి తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా' చిత్రంలో నటిస్తున్నారు. మంబై నేపథ్యంతో మాఫియా బ్యాక్ డ్రాప్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ప్రస్తుతం 'కాలా' చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబైలోనే జరుగుతోంది. ఇందులో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. తమిళంతో పాటు హిందీ .. తెలుగు భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హిందీ వెర్షన్‍లోను రజనీకాంత్ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోనున్నట్లు సమాచారం.

17 ఏళ్ల తర్వాత రజనీ మళ్లీ ఇలా...

17 ఏళ్ల తర్వాత రజనీ మళ్లీ ఇలా...

2000 సంవత్సరంలో అనిల్ కపూర్‌తో కలిసి నటించిన 'బులందీ' సినిమా కోసం రజనీకాంత్ హిందీలో డబ్బింగ్ చెప్పారు. 17 సంవత్సరాల అనంతరం రజనీ మళ్లీ ‘కాలా' సినిమా కోసం హిందీలో డబ్బింగ్ చెబుతున్నారు.

కరికాలన్

కరికాలన్

కరికాలన్ అలియాస్ కాలా పాత్రలో రజనీకాంత్ ఈచిత్రంలో కనిపిస్తారు. కరికాలన్‌ అంటే అర్థం యోధుడు, సమర్థుడు అని. దాంతో, ఇది నూటికి నూరుపాళ్ళూ పొలిటికల్‌ సినిమాయేనని రజనీకాంత్‌ అభిమానులు భావిస్తున్నారు. మరోపక్క, ఈ సినిమా టైటిల్‌ వెనుక రాజకీయ కారణాలేమీ లేవనీ, పవర్‌ఫుల్‌గా వుంటుందనే ఈ టైటిల్‌ పెట్టామని నిర్మాత ధనుష్‌ చెబుతున్నాడు.

ఆ జీపు వెనుక స్టోరీ

ఆ జీపు వెనుక స్టోరీ

'కాలా' ఫస్ట్ లుక్ పోస్టర్లో జీపు మీద కూర్చొని డాన్ లా కనిపిస్తున్న రజని ఈ సినిమాలో ఒక మాఫియా లీడర్ పాత్ర చేస్తున్నారని ఇప్పటికే టాక్. అక్కడ కూర్చున్న జీప్ నెంబర్ MH 01 BR 1956 అని ఉంది. ఈ జీప్ నెంబర్ కూడా చర్చనీయాంశం అయింది. MH అంటే మహారాష్ట్ర అని అర్ధం. ఇక దేశంలోనే గొప్ప బిజినెస్ రాష్ట్రాలుగా పేరు పొందిన గుజరాత్, మహారాష్ట్ర ఒకప్పుడు కలిసుండేవి. 1956లో అవి చీలిపోయాయి. అదే ఏడాది బి.ఆర్.అంబేద్కర్ కూడా చనిపోయారు. సినిమాకు, ఈ అంశాలకు ఏమైనా సంబంధం ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కాలా

కాలా

ఇంతకు ముందు రజనీకాంత్‌కు ‘కబాలి' లాంటి హిట్ అందించిన పా రంజిత్ ఈచిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజనీకాంత్, హుమా ఖురేషి, సముద్రఖని ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2018లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Rajinikanth now is working on his next film 'Kaala'a mafia backdrop film. The film unit is said to be picturizing the scenes in Hindi along with Tamil. Not only this.. Rajni is going to dub his own voice in Hindi as per the latest update. Rajini has dubbed his own voice in Hindi 17 years back for Anil Kapoor starrer 'Bulandi'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu