మరోసారి తాత కాబోతున్న రజనీకాంత్.. ఇంటి సభ్యుల్లో ఆనందోత్సవాలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటిలో ఆనందం వెల్లువిరిసింది. ఇప్పటికే రజనీకాంత్ తాత అయిన సంగతి తెలిసిందే. తన కుమార్తె ఐశ్వర్య ధనుష్, ధనుష్‌ దంపతులకు లింగా, యాత్ర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా తన కుమార్తె సౌందర్య మరోసారి తల్లి కాబోతున్న ఉండటంతో ఇంటి సభ్యుల్లో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి.

సౌందర్య రజనీకాంత్ ఇటీవల వ్యాపారవేత్త విశాఖన్‌తో రెండో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. గతంలో సౌందర్య రజనీకాంత్‌కు మొదటి వివాహం ద్వారా వేద్ అనే కుమారుడు ఉన్నారు. తాజాగా విశాఖన్‌తో పెళ్లి తర్వాత మరోసారి గర్భం దాల్చింది.

Rajinikanth is going to become grand father again, Soundarya Rajinikanth pregnancy confirms,

ఇదిలా ఉండగా, రజనీకాంత్‌ ఇటీవలే అమెరికా పర్యటనను ముగించుకొని చెన్నైకి తిరిగి వచ్చారు. తన హెల్త్ చెకప్ కోసం ఆయన అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. చెన్నైకి వచ్చి రాగానే తన కూతురు తల్లి కాబోతున్నదనే వార్త రజినీకాంత్‌కు సంతోషాన్ని కలిగించింది.

ఇక రజనీకాంత్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో అన్నాతే షూటింగ్‌ను ముగించుకొన్నారు. ఆ తర్వాత తన ఆరోగ్యం పరీక్షల కోసం అమెరికా వెళ్లి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. మళ్లీ షూటింగులో పాల్గొనేందుకు రజనీ దర్శక నిర్మాతలకు డేట్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తున్నది.

ఇదిలా ఉండగా, శివ దర్శకత్వంలో రూపొందుతున్న అన్నాతే చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాకు డి ఇమాన్ సంగీతం, వెట్రీ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్నది. ఈ చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్ తదితరుల నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X