»   » వారికి చెప్పు నేను వచ్చాను: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రజనీకాంత్ సంచలన ఎంట్రీ!

వారికి చెప్పు నేను వచ్చాను: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రజనీకాంత్ సంచలన ఎంట్రీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్.... సౌత్ సినీ పరిశ్రమలో ఈ పేరువింటే చాలు అభిమానులకు పూనకాలు మొదలవుతాయి. రజనీని మించిన సూపర్ స్టార్ సౌత్ సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు రాలేదు. ఆయనకు ఉన్నంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏ హీరోకు లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలు లేని కాలంలోనే ఆయన కోట్లాది మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు.

 ట్రెండ్ ఫాలో అవుతున్న రజనీకాంత్

ట్రెండ్ ఫాలో అవుతున్న రజనీకాంత్

కాలంతో పాటు మనమూ మారాలి.... అనే సూత్రాన్ని ఫాలో అయ్యే రజనీకాంత్ ఇప్పటి ట్రెండును ఫాలో అవతున్నారు. గతేడాది ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన ఆయన తాజాగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ప్రారంభించారు.

వణక్కం అంటూ...

వణక్కం అంటూ.... తమిళంలో అభిమానులను పలకరిస్తూ తన ఫేస్ బుక్ పేజీలో తొలి పోస్టు చేశారు రజనీకాంత్. కొన్ని గంటల క్రితం ఆయన ఖాతా ఓపెన్ చేయగా లక్షల్లో ఆయన్ను ఫాలో అవ్వడం ప్రారంభించారు.

వారికి చెప్పు నేను వచ్చాను

ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి పోస్ట్‌గా ‘కబాలి' చిత్రంలోని ఫోటోను పోస్టు చేస్తూ..‘వణక్కం..వందుతెన్ ను సొల్లు' (వారికి చెప్పు నేను వచ్చాను)అని పేర్కొన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లో అడుగు పెట్టిన నేపథ్యంలో యువతకు కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ ఖాతాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్లో భారీగా...

ట్విట్టర్లో భారీగా...

ఇప్పటికే ట్విటర్‌లో రజనీకాంత్ కు 4.58 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలను కూడా తెరవడాకి వెనక....ఇప్పటి ట్రెండును ఫాలో అవుతూ రాజకీయాల్లో తనదైన ముద్రవేయాలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది.

English summary
Rajinikanth joins Facebook and Instagram. The first post on Thalaivar’s Instagram page is a still from his blockbuster movie Kabali. The tongue-in-cheek caption of the still reads: “Vannakam! Vandhuten nu sollu! (Tell them that I have arrived). This is Rajinikanth’s popular one-liner from the 2016 gangster drama Kabali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu