»   » అసెంబ్లీ ఓపినింగ్ కి కమల్ హాసన్, రజనీ

అసెంబ్లీ ఓపినింగ్ కి కమల్ హాసన్, రజనీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి చెన్నైలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ హాలు ఓపినింగ్ పంక్షన్ కు అటెండ్ కానున్నారు. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పరుది ఇలంవళుది స్వయంగా రజనీకాంత్, కమల్ హాసనస్ లను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారిద్దరూ వస్తానని మాట ఇచ్చారు. అలాగే ఈ ఉత్సవానికి డిప్యూటీ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్వయంగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించారు. ఈనెల 13న సెక్రటేరియట్ నూతన కాంప్లెక్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఆరోజు ఈ సినిమా స్టార్స్ వస్తున్నారని తెలియంటే చాలా మంది అభిమానులు ఆ ప్రదేశంలో గుమిగూడే అవకాశముందని భద్రతా శాఖ అంచనాలు వేస్తోంది. దాంతో గట్టి బందోబస్తు మధ్య ఈ ఓపినింగ్ జరగనుంది. చెన్నైలో నిర్మించి ఈ నూతన సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోనే అధికారిక కార్యక్రమాలు అన్నీ జరగనున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu