»   » రజనీ.. ఒకప్పుడు భగ్న ప్రేమికుడే?: తొలిసారిగా ఆ విషయం బయటపెట్టిన సూపర్ స్టార్..

రజనీ.. ఒకప్పుడు భగ్న ప్రేమికుడే?: తొలిసారిగా ఆ విషయం బయటపెట్టిన సూపర్ స్టార్..

Subscribe to Filmibeat Telugu
రజనీ..భగ్న ప్రేమికుడే ! ప్రేమ విషయం బయటపెట్టిన సూపర్ స్టార్..!

తొలిప్రేమ గుర్తులు ఎప్పుడూ ప్రత్యేకమే. ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జ్ఞాపకాలను హత్తుకుంటున్నప్పుడు.. తెలియకుండానే పెదాలపై ఓ చిరునవ్వు మెరవడం సహజం. ఒక ఎరుకలేని తనం.. ఒక ఆకర్షణ వెంటాడే సమయం.. వెరసి అదో ప్రత్యేక అనుభూతి. అలాంటి అనుభూతి తన జీవితంలోనూ ఉందని సూపర్ స్టార్ రజనీకాంత్ తొలిసారిగా ఆ విషయాన్ని బయటపెట్టారు.

హైస్కూల్లో చదివే రోజుల్లో:

హైస్కూల్లో చదివే రోజుల్లో:

'అవును నాకూ ఓ తొలి ప్రేమ ఉంది. కర్ణాటకలో హైస్కూల్లో చదివే రోజుల్లో ప్రేమలో పడ్డాను. ఎప్పటికీ అది మరిచిపోలేను. ఏ వ్యక్తికైనా తొలిప్రేమ గుండెల్లో నిలిచిపోతుంది. కొంతమంది ఆ ప్రేమను దక్కించుకుంటారు. మరికొంతమంది విఫలమవుతుంటారు. నేనూ విఫలమయ్యాను. ఇట్స్ ఏ ఫెయిల్యూర్..' అని తన తొలిప్రేమ గురించి చెప్పుకొచ్చారు రజనీ.

 నేను కోరుకున్నది చిన్న జీవితం..:

నేను కోరుకున్నది చిన్న జీవితం..:

సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక స్కూటర్ లాంటి చిన్న చిన్న కోరికలు తీర్చుకోవాలన్న స్టేజీ నుంచి ఇంతదాకా ఎదిగిరావడం పట్ల రజనీ సంతోషం వ్యక్తం చేశారు. తమిళ ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుందని చెప్పుకొచ్చారు.

 మలేషియాలో రజనీ..:

మలేషియాలో రజనీ..:

నడిఘర్ సంఘ భవన నిర్మాణ నిమిత్తం నిధులు సేకరించే పనిలో పడ్డారు తమిళ నటీనటులు. ఇందుకోసం మలేషియా కేంద్రంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం కోసం రజనీకాంత్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా నటుడు వివేక్ రజనీకాంత్‌ను పలు విషయాలపై ప్రశ్నించారు.

1996లో కుర్చీ వదులుకోవడంపై?..:

1996లో కుర్చీ వదులుకోవడంపై?..:

'1996లోనే కుర్చీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. కానీ నేను మాత్రం సున్నితంగా తిరస్కరించాను. 45ఏళ్ల వయసులో పదవిపై లేని వ్యామోహం 68ఏళ్ల వయసులో వస్తుందా?..' అంటూ రజనీ ఇటీవల ప్రస్తావించారు. అలా కుర్చీ వదులుకున్నందుకు ఎప్పుడూ బాధపడలేదా? అని తాజాగా ఆయన్ను ప్రశ్నిస్తే.. ఒక్క సెకండ్ కూడా దానికోసం బాధపడలేదని తెలిపారు.

 కమల్‌తో తొలిసారి..:

కమల్‌తో తొలిసారి..:

కమల్ హాసన్‌తో తన తొలి మలేషియా ట్రిప్‌ను కూడా రజనీ గుర్తుచేసుకున్నారు. 'నినైతాలే ఇనిక్కుమ్' సినిమా సమయంలో కమల్ తో పాటు తొలిసారి మలేషియా వెళ్లినట్లు చెప్పారు.

ఆ సమయంలో కమల్ పెద్ద స్టార్ అని, కానీ తన పట్ల చాలా ప్రేమ, అభిమానం కనబరిచాడని తెలిపారు. షూటింగ్ పూర్తయిన రోజు రాత్రి తెల్లవారుజామున 3గం. వరకు తామిద్దరం చాలా ఎంజాయ్ చేశామని, ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు.

English summary
Rajinikanth on his first love, evergreen style and nightlife with Kamal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X