»   »  చెన్నై దీక్షలో రజనీకాంత్

చెన్నై దీక్షలో రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajinikanth
చెన్నైకి తాగు నీరు అంధించాలనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన హోగన్‌కల్ ప్రాజక్టు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. కర్ణాటక ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం సినీ పరిశ్రమను కూడా తాకింది. కర్ణాటక సినిమాలను తమిళనాడులో ఆడించకూడదని బంద్ చేశారు. అయితే కర్ణాటకలో తమిళ సినిమాహాళ్లపై దాడి చేసి రెండు కోట్లవరకు ఆస్థి నష్టం చేశారు. దీనికి స్పందించిన సినీనటులు శుక్రవారం ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. అయితే ఈ నిరాహార దీక్షకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరు కావాలని నడిగర్ సంఘం అల్టిమేట్ జారీ చేసింది. కర్ణాటకలో పుట్టి తమిళనాడులో సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే నిరాహార దీక్షకు హాజరయ్యారు. చెన్నైలో ఉన్న తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ వారు హాజరయ్యారు. ప్రముఖ హీరో, హీరోయిన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రజనీకాంత్ తో పాటు శరత్ కుమార్, అర్జున్, రాధిక తదితరులు పాల్గొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X