twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. సినిమాలపై సంచలన ప్రకటన.. ఆ చిత్రమే చివరిదా?

    |

    సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి వేదిక సిద్ధమైంది. గురువారం రజనీకాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేయడంతో తమిళ రాజకీయాల్లో ప్రకంపనాలు రేగాయి. ఈ సందర్భంగా తన సినిమాలపై ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తలైవా చేసిన ప్రకటన ఏమిటంటే..

     అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం

    అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం

    గత కొద్దిరోజులుగా రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై అనేక ఉహాగానాలు వస్తున్నాయి. అయితే ఊహాగానాలకు తెరదించుతూ గురువారం సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించబోతున్నాం. నిజాయితీ, పారదర్శకత, అవినీతిరహిత, అధ్యాత్మిక రాజకీయ పార్టీని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాను. రాజకీయా్లో ఓ అద్భుతం జరగబోతుంది అంటూ రజనీకాంత్ ట్వీట్ చేయడంతో అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది.

     డిసెంబర్ 31న అధికారిక ప్రకటన

    డిసెంబర్ 31న అధికారిక ప్రకటన

    రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన తర్వాత రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. నేను రాజకీయ పార్టీని ప్రారంభించే విషయాన్ని డిసెంబర్ 31వ తేదీన ప్రకటిస్తాను. అప్పటి వరకు అంటే.. జనవరి వరకు అన్నాతే సినిమా షూటింగులో బిజీగా ఉంటాను. ఆలోపున నా పార్టీని అధికారికంగా ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయిస్తాం అని అన్నారు.

    సిరుతాయ్ శివ దర్శకత్వంలో అన్నాతే

    సిరుతాయ్ శివ దర్శకత్వంలో అన్నాతే

    దర్శకుడు సిరుతాయ్ శివ దర్శకత్వం వహిస్తున్న అన్నాతే చిత్రం షూటింగు ఇప్పటి వరకు 60 శాతం పూర్తయింది. ఇంకా 40 శాతం షూట్ పూర్తి కావాల్సింది అ ని స్పస్టం చేశారు. 2021లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలోపు అన్నాతే సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తాం అని తెలిపారు.

    రామోజీ ఫిలిం సిటీలో విలేజ్ సెట్

    రామోజీ ఫిలిం సిటీలో విలేజ్ సెట్

    ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో విలేజ్ సెట్ వేసి ఈ చిత్ర షూటింగును లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ అనుగుణంగా షూటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే.. ఎన్నికలకు ముందు అన్నాతే చివరి సినిమా కానున్నది. ఎన్నికల తర్వాత వెలువడే ఫలితాలను బట్టి రజనీకాంత్ సినిమా భవితవ్యం ఆధారపడి ఉండే అవకాశం ఉంది.

    English summary
    Super Star Rajinikanth about political entry in TN Assembly elections. He tweeted that We will surely win assembly polls and give an honest, transparent, corruption free, and spiritual politics. A wonder and miracle will definitely happen in Tamil language.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X