వెనక్కు తగ్గిన రజనీ.. దూకుడు పెంచిన విజయ్.. నిరాశలో ఫ్యాన్స్..

ఈ ఏడాది దీపావళికి వస్తుందనుకొన్న రోబో 2.0 రిలీజ్ వాయిదా పడింది. రోబో2 చిత్రాన్ని 2018 జనవరిలో విడుదల చేయాలని నిర్ణయించినట్టు నిర్మాతలు శుక్రవారం రాత్రి ప్రకటించడంతో అభిమానులు డీలాపడ్డారు.

By Rajababu

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఈ ఏడాది దీపావళికి వస్తుందనుకొన్న రోబో 2.0 రిలీజ్ వాయిదా పడింది. రోబో2 చిత్రాన్ని 2018 జనవరిలో విడుదల చేయాలని నిర్ణయించినట్టు నిర్మాతలు శుక్రవారం రాత్రి ప్రకటించడంతో అభిమానులు డీలాపడ్డారు. రజనీ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో దీపావళి రేసులోకి హీరో విజయ్ దూసుకు రావాలని నిర్ణయించినట్టు సమాచారం.

రోబో2 రిలీజ్ వాయిదా

రోబో2 రిలీజ్ వాయిదా

సంచలన దర్శకుడు శంకర్ దర్వకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న రోబో2 చిత్రాన్ని వాస్తవానికి 2017 దీపావళికి విడుదల చేయాలనుకొన్నాం. కొన్ని కారణాల వల్ల ఆ రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని 2018 జనవరి 25 తేదీన విడుదల చేయాలని నిర్ణయించాం అని నిర్మాతలు ప్రకటన చేశారు.

దీపావళికి విజయ్ సినిమా

దీపావళికి విజయ్ సినిమా

ప్రస్తుతం హీరో విజయ్ ఓ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ ఇంకా ఖారారు కాలేదు. కానీ రోబో2 వాయిదా పడటంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇంకా పేరు పెట్టని తన చిత్రాన్ని ముందే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.

విజయ్‌కు దీపావళి లక్కీ ఫెస్టివల్

విజయ్‌కు దీపావళి లక్కీ ఫెస్టివల్

దీపావళి పండుగ నేపథ్యంలో విడుదలైన విజయ్ చిత్రాలు మంచి కలెక్షన్లను సాధించాయి. కత్తి, తుపాకీ లాంటి చిత్రాలు వందకోట్ల క్లబ్‌లో చేరాయి. దాంతో దీపావళికే తన తాజా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలకు సూచించినట్టు తెలుస్తున్నది. ఒకవేళ దీపావళికి రిలీజ్ చేయలేకపోయినట్టయితే జనవరిలో రోబో2 తో పోటీ పడాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని వ్యకత్ం చేశాడనద సమాచారం.

విజయ్ బర్త్‌డేన ఫస్ట్ లుక్..

విజయ్ బర్త్‌డేన ఫస్ట్ లుక్..

అట్లీ దర్శకత్వంలో విజయ్ తాజా చిత్రం రూపొందుతున్నది. రోబో2 వాయిదా పడటంతో చిత్ర యూనిట్ అలర్ట్ అయ్యి దీపావళీ లక్ష్యంగా రేయింబవళ్లు శ్రమిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. విజయ్ బర్త్ డే జూన్ 22న సినిమా ఫస్ట్‌లుక్, ఆగస్టులో ఆడియో ఆవిష్కరణగా గ్రాండ్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ సినిమాకు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ సంగీతం సమకూరుస్తున్నాడు. విజయ్‌ కెరీర్‌లో ఈ చిత్రం 61వది కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X