»   »  అద్బుతం అంటారంతే :కబాలి...ఇది 'ఐస్ ఏజ్ వెర్షన్:5' గ్యాంగ్ వెర్షన్ (వీడియో)

అద్బుతం అంటారంతే :కబాలి...ఇది 'ఐస్ ఏజ్ వెర్షన్:5' గ్యాంగ్ వెర్షన్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'కబాలి' సినిమా కోసం ఆయన అభిమానులతోపాటు, విదేశీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ చిత్రాలకు మునుపెన్నడూ లేనిరీతిలో కబాలికి క్రేజీ పెరిగింది.

మలేషియా, సింగపూర్‌, అమెరికా, చైనా, జపాన్‌ వంటి పలు దేశాల్లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఐస్ ఏజ్ ఫైవ్ వాళ్లు...తలైవర్ కు ట్రిబ్యూట్ గా నిరుప్పుడా సాంగ్ ని ఐస్ ఏజ్ వెర్షన్ లో విడుదల చేసారు. మీరు ఈ వీడియోని చూడండి. మెచ్చుకోకుండా ఉండలేరు. అద్బుతం అంటారంతే..


సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ను అభినందిస్తూ 'ఐస్‌ ఏజ్‌-5' చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇందులో బ్యాక్‌ గ్రౌండ్‌లో కబాలీ.. అంటూ వస్తున్న పాట, వీడియోలో రజినీకాంత్‌ డైలాగ్స్‌తో కార్టూన్స్‌ చేస్తున్న సందడి చూడడానికి చాలా సరదాగా ఉంది.

'ఐస్‌ ఏజ్‌-5' చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పా రంజిత్‌ దర్శకత్వం వహించిన కబాలి చిత్రం జులై 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

రీసెంట్ గా...'కబాలి' చిత్రం సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు నుంచి క్లీన్‌-యూ సర్టిఫికెట్‌ లభించినట్లు చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. 152 నిమిషాలు చిత్రం నడుస్తుందని పేర్కొన్నారు. అభిమానులకు సంబరాలు ప్రారంభమయ్యాయని పోస్ట్‌ చేశారు.

 Rajinikanth's Kabali: Tribute To Thalaivar from Ice Age:5 gang

పా రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కలైపులి ఎస్‌ థను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో రజినీకాంత్‌ సరసన రాధికా ఆప్టే నటించారు. ఈ నెల 22న 'కబాలి' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక మలేసియాలోని రజనీకాంత్‌ అభిమానులకు అక్కడ ఈ నెల 21వ తేదీన ఆయన నటించిన 'కబాలి' సినిమా ప్రీమియర్‌ షోను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాత్రి 9 గంటలకు ఓ ప్రముఖ థియేటర్‌లో దీనిని ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన టికెట్లు కూడా సిద్ధం చేశారు. ఒక్కో టికెట్‌ 100 రింగిట్స్‌కు విక్రయిస్తున్నారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 22వ తేదీన ప్రీమియర్‌ షో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని త్వరలోనే నిర్మాత కలైపులి థాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్‌కు సరసన రాధిక ఆప్టే నటించారు. సంతోష్‌ నారాయణన్‌ రూపొందించిన పాటలకు ఇప్పటికే మంచి ఆధరణ దక్కింది.

English summary
Fox Star Studio’s “Ice Age: Collision Course” gang paid tribute to Rajinikanth in a cute video ahead of “Kabali”s’ release. Watch the tribute to Rajinikanth from the “Ice Age” gang:
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu