‘లింగా’ నష్టాలు- రజనీకాంత్‌కు డిస్ట్రిబ్యూటర్ల సెగ!

By Bojja Kumar

హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లింగా' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ భారీ బడ్జెట్ మూవీ బాక్సాఫీసు అంచనాలను అందుకోలేక బోల్తా పడింది. ఈ సినిమాకు రివ్యూలు నెగెటివ్‌గా రావడం, మౌత్ టాక్ కూడా అనుకూలంగా లేక పోవడంతో తొలి వారం గడిచే నాటికి డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రం నష్టాలు మిగిల్చింది.

ఈ చిత్రాన్ని రాక్ లైన్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లో రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఆయన ఈచిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అమ్మగా.....ఆ సంస్థ వద్ద నుండి లోక్ డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనుగోలు చేసి ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులోని పలు ఏరియాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లంతా భారీగా ధర చెల్లించి ఈరోస్ సంస్థ నుండి రైట్స్ కొనుగోలు చేసారు.

Rajinikanth’s ‘Lingaa’ in lose

అయితే సినిమా ఆడక నష్టాల పాలు కావడంతో.....డిస్ట్రిబ్యూటర్లంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తమ నష్టాలను భర్తీ చేయాల్సిందిగా రజనీకాంత్ ను డిమాండ్ చేస్తున్నారు. గతంలో రజనీకాంత్ తన సినిమాల వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ సారి ఏ చేస్తారు అనేది చర్చనీయాంశం అయింది. కానీ...కొందరు మాత్రం డిస్ట్రిబ్యూర్ల చర్యను వ్యతిరేకిస్తున్నారు. సినిమా అనేది వ్యాపారం. లాభాలు, నష్టాలు ఉంటాయి. రజనీకాంత్ ను ఇబ్బంది పెట్టడం తగదని అంటున్నారు.

లింగా సినిమా విషయానికొస్తే....ఈ చిత్రం రజనీకాంత్ పుట్టిరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదలైంది. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X