»   » మళ్శీ పెళ్శి చేసుకుంటున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్..

మళ్శీ పెళ్శి చేసుకుంటున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆయన మంచికి మారు పేరు. ఏనాడూ ఏవివాదాల్లో కూడా కనబడలేదు. ఆయన సౌత్ ఇండియా సినీ పరిశ్రమకే దేవుడు. ఆయన ఎంత పెద్ద సూపర స్టార్ అయినప్పటికీ ఎన్నడూ తన అభిమానులకు చిన్న పిల్లాడు మాత్రమే. దానికి కారణం ఆయన అణకువ, సౌమ్యశీలత. ఎవరా ఆయన అనుకుంటున్నారా ఇంకెవరూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్. తనజీవితంలో అట్టడగు స్దాయినుంటి మొత్తం సౌత్ ఇండియానే శాసించే స్టాయికి వచ్చాడంటే మాటలా. అలాంటి సూపర్ స్టార్ త్వరలో మళ్శీ పెళ్శి చేసుకోబోతున్నారు. అదేంటి ఇంకో పెళ్శా అని కంగారు పడకండి.. దానికి ఓకారణం ఉంది..

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్ షష్టిపూర్తి వేడుక శుక్రవారం చెన్నైలో ఘనంగా జరగనుంది. రజనీకాంత్‌కు ఈ నెల 12వ తేదీతో 60 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ, లత దంపతులకు షష్టిపూర్తి వేడుకను జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రజనీ షష్టిపూర్తి వేడుక పదో తేదీన చెన్నైలోని పోయస్ గార్డెన్‌లో ఉన్న వారి స్వగృహంలో ఆడంబరంగా జరగనుంది. ఆ రోజు ఉదయం పది గంటలకు రజనీ దంపతులకు పురోహితుల వేదమంత్రాల మధ్య 60వ వివాహ వేడుక జరుగనుంది. షష్టిపూర్తి కార్యక్రమంలో రజనీ కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పాల్గొననున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu