»   » రజనీకి ఏమైంది.. వైద్య చికిత్స కోసం అమెరికాకు.. కాలాకు బ్రేక్..

రజనీకి ఏమైంది.. వైద్య చికిత్స కోసం అమెరికాకు.. కాలాకు బ్రేక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న కాలా చిత్రానికి బ్రేక్ పడింది.సూపర్ స్టార్ రజనీకాంత్ గత బుధవారం తన కూతురు ఐశ్వర్యతో కలిసి వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లారు. కాలా షూటింగ్‌ సందర్భంగా ఆయన అస్వస్థతకు గురైనారనే రూమర్ ప్రచారంలో ఉంది. అందుకే రజనీని అమెరికాకు తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. కానీ రెగ్యులర్ చెకప్స్ కోసమే రజనీ యూఎస్ వెళ్లారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

వైద్య చికిత్స కోసం అమెరికాకు..

వైద్య చికిత్స కోసం అమెరికాకు..

రజనీకాంత్ దాదాపు 10 రోజులకు పైగా అమెరికాలో ఉంటారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత రజనీ జూలై 10న చెన్నైకి చేరుకొంటారు. అనంతరం రెండు రోజుల తర్వాత మళ్లీ కాలా షూటింగ్‌లో పాల్గొంటారు. అంటే జూలై 15వ తేదీ వరకు కాలా షూటింగ్‌కు బ్రేక్ పడినట్టే.


నిర్మాతగా అల్లుడు ధనుష్

నిర్మాతగా అల్లుడు ధనుష్

విలక్షణ నటుడు, రజనీ అల్లుడు ధనుష్ కాలా చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్నది. మరాఠీ భాషలోకి కూడా డబ్ చేస్తారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి కబాలి దర్శకుడు పా రంజిత్ డైరెక్టర్. కాలా చిత్రంలో మరోసారి రజనీ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడు. ముంబైలో తమిళ ప్రజల హక్కుల కోసం పోరాటిన మాఫియాడాన్ పాత్రలో కనిపిస్తారు.


ముంబైలో కోటితో భారీ సెట్

ముంబైలో కోటితో భారీ సెట్

ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను ఇటీవల చెన్నైలో చిత్రీకరించారు. ముంబై మహానగరం నేపథ్యంగా తెరకెక్కుతున్నది. ఈ నేపథ్యంలో ముంబైలోని ధారవి ప్రాంతంలో దాదాపు కోటి రూపాయల బడ్జెట్‌తో ఓ స్లమ్ సెట్‌ను వేసి షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


త్రిభాషా చిత్రంగా.. మరాఠీలోకి డబ్

త్రిభాషా చిత్రంగా.. మరాఠీలోకి డబ్

ముంబై కథా నేపథ్యం కావడంతో ఏకకాలంలో హిందీ, తమిళ భాషల్లో కాలాను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేస్తారు. హిందీ చిత్రానికి తగినట్టుగా కొన్ని సీన్లను స్పాట్‌లోనే ఇంప్రూవైజ్ చేస్తున్నారనే తాజా సమాచారం. ఈ చిత్రంలో నానా పాటేకర్, పంజక్ త్రిపాఠి, అంజలీ పాటిల్, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు.English summary
Superstar Rajinikanth on Wednesday night flew to the US with his daughter Aishwarya for a routine medical check-up, amid rumours that the 67-year-old is unwell. A reliable source close to the actor has clarified that he is absolutely fine and has gone to the US for a regular medical check-up, just like he was present there last year around the same time. He is expected to return to Chennai on July 10 and will join the sets of his film Kaala two days later.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu