»   »  చిరు తరువాత రజనీ

చిరు తరువాత రజనీ

Posted By:
Subscribe to Filmibeat Telugu


చెన్నయ్ లో చిరంజీవి వీక్షించిన పొల్లదవన్ సినిమా చిరంజీవి మిత్రుడు రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించాడు. పొల్లదవన్ టైటిల్ రజనీకాంత్ 80వ దశకంలో నటించిన సూపర్ హిట్ సినిమా పేరు మీదే ఆయన అల్లుడు కూడా హీరోగా చేశాడు. ధనుష్ తన మామ రజనీకాంత్ పర్మిషన్ తీసుకొనే విభిన్నంగా సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఎ, బి సెంటర్లలో సినిమా ఇపుడిపుడే ఊపందుకొంటోంది. సినిమా యూనిట్ కూడా ప్రమోషన్ పనిలో పడింది. సినీ ప్రముఖులను ఆహ్వానించి సినిమా ప్రదర్శన చేస్తున్నారు.

మంగళవారంనాడు ఫోర్ ఫ్రేమ్స్ ప్రివ్యూ థియేటర్ కు రజనీకాంత్ పొల్లదవన్ సినిమా చూడడానికి వచ్చాడు. ధనుష్ తో పాటు మిగతా యూనిట్ అంతా రజనీకాంత్ ను ఘనంగా ఆహ్వానించారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఆ తరువాత సినిమా చూసిన రజనీకాంత్ సినిమా కోసం పనిచేసిన వారినంతా పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇకపోతే ఆదివారంనాడు చిరంజీవి కూడా పొల్లదవన్ సినిమాను వీక్షించాడు. చెన్నయ్ లోని దేవిశ్రీదేవి ప్రివ్యూ థియేటర్ లో ఈ సినిమాను చూశాడు. తనకు సినిమా బాగా నచ్చిందని, ఈ సినిమాను తెలుగులోకి కుమారుడు రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేయనున్నట్టు ఆయన తెలిపాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X