twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త తలనొప్పి: వివాదంలో ‘బ్రూస్ లీ’ టైటిల్

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా చిత్రం ‘బ్రూస్ లీ' తమిళంలోనూ అదే రోజు ‘బ్రూస్ లీ 2' టైటిల్ తో విడుదలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ టైటిల్ వివాదంలో పడింది. తమిళంలో ఇదే టైటిల్ తో సంగీత దర్శకుడు జివి ప్రకాష్ హీరోగా రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘బ్రూస్ లీ' కూడా వస్తోంది. ఇందులోనూ కృతి కర్భందే హీరోయిన్. దాంతో ఇప్పుడు వివాదం మొదలైంది. ఈ టైటిల్ తమ చిత్రానికి డైరక్ట్ గా పెద్ద దెబ్బకొట్టినట్లే అంటున్నారు తమిళ నిర్మాత, దర్శకుడు. ఈ మేరకు వారు తమిళ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసారు.

    నిర్మాత సెల్వ కుమార్ మాట్లాడుతూ..., "మాకు దయచేసి ‘బ్రూస్ లీ' టైటిల్ ని వదిలేయండి. ‘బ్రూస్ లీ2 ' అంటూ ఇంకో టైటిల్ తో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మొదట మేమే టైటిల్ ని రిజిస్టర్ చేసుకుని పబ్లిసిటీ మొదలుపెట్టాం. తెలుగులో వారు ఏం టైటిల్ పెట్టుకున్నాం మాకు ఇబ్బంది లేదు. తమిళ డబ్బింగ్ టైటిల్ మాత్రం మార్చమంటున్నాం. వారు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో రిజిస్టర్ చేసారని తెలిసింది. మేము అక్కడే చేసాం. అలా ఎలా రెండు టైటిల్స్ రిజిస్టర్ చేసి ఫర్మిషన్ ఇచ్చారో మాకు తెలియటం లేదు. ఈ విషయమై తమిళ నిర్మాతల మండలిలో మేము ఫిర్యాదు చేస్తున్నాం. మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది" అన్నారు.

    చిత్రం విశేషాలకు వెళ్తే...

    Ramcharan's Bruce Lee Tamil title in trouble ?

    రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన 'బ్రూస్‌లీ' సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఇప్పటికే రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించటం అనే వార్త, శ్రీను వైట్లతో తొలిసారి చేయటం, ఇప్పటికే వదిలిన ట్రైలర్స్ సినిమా బిజినెస్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయేలా చేసాయి.

    రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ 3 నిమిషాల పాటు కనిపించి అభిమానులను ఎంటర్టెన్ చేయనున్నారు.

    చిరంజీవి మాట్లాడుతూ...బ్రూస్‌లీలో తన పాత్ర గురించి అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారని అన్నారు. బ్రూస్‌లీ సినిమాలో తన ఎంట్రీ కొస మెరుపు లాంటిదని చిరంజీవి అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పాలంటే సంపూర్ణంగా భోజనం చేసిన తర్వాత ఒక స్వీటు తిన్నట్టు ఉంటుందన్నారు. తమకు ఇన్‌స్పిరేషన్ అభిమానులేనని చెప్పారు. సినిమా ఎలాగు రిలీజ్‌కు దగ్గరకు వచ్చింది కాబట్టి సినిమాలోని డైలాగ్ చెప్పడానికి వెనుకాడనని ఒక డైలాగ్ చెప్పారు. బ్రూస్‌లీలో రామ్‌చరణ్ కొట్టిన బాస్ మీ స్టెమినోను, మీ స్పీచ్‌ను అందుకోలేను బాస్ అనే డైలాగ్‌ను చెప్పారు.

    Ramcharan's Bruce Lee Tamil title in trouble ?

    రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్‌ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్‌. కథ రీత్యా ఈ సినిమాలో కొత్త తరహా ఫైట్లు చేసినట్లు సమాచారం.

    రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Music director turned actor GV.Prakash's ‘Bruce Lee’ film makers are worried that Ram Charan's dubbed version ‘Bruce Lee’ which is releasing as ‘Bruce Lee 2’ will create confusion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X