»   » మీరు 'రోబో' చిత్రం పైరసీ చూస్తే...

మీరు 'రోబో' చిత్రం పైరసీ చూస్తే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

"రోబో" చిత్రం పైరసి పై అప్పుడే యుద్దం మొదలైంది. ఈ చిత్రం ఆన్ లైన్ పైరసిని ప్రొటక్ట్ చేయటానికి యాంటీ పైరసి గ్రూప్ ఏర్పాటు చేసారు. ఈ చిత్రం డివిడి, ఓవర్ సీస్ స్క్రీనింగ్ హక్కులను ఫికస్ ఎంటర్టైన్మెంట్ వారు సొంతం చేసుకుని వారే ఈ పైరసీ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా రోబో చిత్రం పైరేటిడ్ లింక్స్, షేరింగ్ ఫైల్స్, టోరెంట్ ఫైల్స్ లీగల్ యాక్షన్ తీసుకుంటామంటున్నారు. అలాగే ఇప్పటికే సౌత్ ఇండియా సినిమాలను పైరసీ చేసి టోరెంట్స్ పెట్టే సైట్స్ కి నోటీసులు పంపించామని చెప్పారు. అలాగే తాము ఆరున్నర కోట్లు ఖర్చు పెట్టి ఓవర్ సీస్ రైట్స్ తీసుకున్నామని వంద ప్రింట్లుకు పైగా విడుదల చేస్తున్నామని అన్నారు. అలాగే ప్రేక్షకులను ధియోటర్స్ లోనే రోబో చిత్రం చూడమని, అప్పుడే గ్రాఫిక్స్ ని ఎంజాయ్ చేయటం సాధ్యమవుతుందన్నారు. అలాగే ఎవరైనా రోబో చిత్రం పైరేటైడ్ వీడియో గానీ, టోరెంట్ గానీ చూస్తే... antipiracygroupllc@gmail.com రిపోర్ట్ చేసి సహకరించమంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu