»   » ధనుష్ సినిమాలో సాయి పల్లవి

ధనుష్ సినిమాలో సాయి పల్లవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఫిదా' సినిమాతో తెలుగు వారిని ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీ అయిపోతోంది. తాజాగా తమిళంలో ధనుష్ హీరోగా రాబోయే 'మారి-2' సినిమాకు ఆమె సైన్ చేసంది. తమిళంలో ఆమెకు ఇది రెండో సినిమా.

సాయి పల్లవి తమిళనాడుకు చెందిన అమ్మాయే అయినప్పటికీ మలయాళం 'ప్రేమమ్' సినిమాతో పాపులర్ అయింది. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో వెంటనే 'కలి' అనే మరో మలయాళం చిత్రం చేసింది. తర్వాత తెలుగులో చేసిన 'ఫిదా' చిత్రం గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

Sai Pallavi signs second Tamil film,

ధనుష్ హీరోగా తెరకెక్కిన మారి (తెలుగులో మాస్‌) చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా ఇపుడు 'మారి 2' చిత్రం తెరకెక్కుతోంది. మారి -2 చిత్రం కోసం సాయి ప‌ల్ల‌విని హీరోయిన్‌గా ఎంచుకున్న‌ట్లు నిర్మాణ సంస్థ వూండ‌ర్‌బార్ ఫిల్మ్స్ వెల్ల‌డించింది.

ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తీయ‌నున్నారు. ఈ చిత్రానికి బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

English summary
After making a splash in Malayalam and Telugu industries with films such as Premam, Kali and Fidaa, Sai Pallavi is making inroads into Tamil filmdom. Having recently completed shooting for AL Vijay’s Karu, in which she plays a mother to an 8-year-old, Pallavi will be next seen in Dhanush’s Maari 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu