»   » మురుగదాస్ దర్శకత్వంలో సమంత

మురుగదాస్ దర్శకత్వంలో సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సమంతకు వరసగా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. రెస్ట్ తీసుకుంటానన్నా ఆగటం లేదు. తెలుగు,తమిళ స్టార్ హీరోలు,దర్శకులు,నిర్మాతలు ఆమెను లక్కీ గా భావించి తమ చిత్రంలో తీసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా ఆమె ప్రముఖ దర్శకుడు మురగదాస్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది.

పుట్టి పెరిగింది చెన్నైలోనే అయినా.. సమంతకు హీరోయిన్ గా గుర్తింపునిచ్చింది మాత్రం టాలీవుడే. ఎన్టీఆర్‌, మహేష్‌, పవన్‌ వంటి అగ్ర హీరోలతో జతకట్టి టాలీవుడ్‌ టాక్‌ ఆఫ్‌ది హీరోయిన్‌గా నిలిచిన ఈ అమ్మడు.. ప్రస్తుతం కోలీవుడ్‌ క్వీన్‌గా మారనుంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తోంది సమంత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉండగా మరో పెద్ద హీరో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

'తుపాకి' తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ మళ్లీ నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఏఆర్‌ మురుగదాస్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మళ్లీ విజయ్‌తో సినిమా తెరకెక్కించడం చాలం ఆనందంగా ఉంది. జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సినిమాలో విజయ్‌కి జంటగా సమంత నటించడం ఖాయమైంది. అనిరుధ్‌ తొలిసారిగా విజయ్‌ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.

English summary

 If reports are to be believed then Samantha is going to be seen in director AR Murugadoss' next film opposite Ilayathalapathy Vijay. Currently, Vijay is busy shooting for 'Jilla'. This will be the first time Vijay will be working with Samantha in any film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu