»   » లేడీ డాన్‌ గా అవతారమెత్తిన సెక్సీ సంగీత

లేడీ డాన్‌ గా అవతారమెత్తిన సెక్సీ సంగీత

Posted By:
Subscribe to Filmibeat Telugu

కృష్ణవంశీ ఖడ్గం చిత్రంలో అమాయికంగా కనపించే పాత్రలో కనిపించిన సంగీత తాజాగా 'బీడా పాండ్యమ్మ" అనే లేడీ డాన్‌ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని చాలా స్టైలిష్ గా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. నిజజీవత సంఘటనలు కొన్నిటిని ఆధారం చేసుకుని ఈ చిత్రం కథ రూపొందించినట్లు చెప్తున్నారు. తంబికొట్టయ్‌ రాజేశ్వరి ఫిలింస్‌ పతాకంపై అమ్ము రమేష్‌ దర్శకత్వంలో ఆర్‌.కె.సురేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ "ఇంతకు ముందు అనేక లేడీ డాన్‌ చిత్రాలు వచ్చినప్పటికీ ఇటువంటి చిత్రం రాలేదు. 'బీడా పాండ్యమ్మ" చదువుకోకపోయినా,అక్షరం ముక్క రాకపోయినా అయినప్పటికీ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ గురించి అక్షరం పొల్లు పోకుండా చెప్పేయగలదు. న్యాయశాస్త్రం గురించి క్షణ్ణంగా వివరించగలదు. ఆమె తెలివితేటల ముందు ఎవరైనా మోకరిల్ల వలసిందే! దీని కోసం సంగీత చాలా హోమ్‌ వర్క్‌ చేసారు. విలన్‌ పాత్రధారి రాజేంద్రన్‌, కథానాయిక సంగీత మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకులకు భలే థ్రిల్‌ కలిగిస్తాయి" అంటున్నారు. పూనమ్‌ బజ్వా, ప్రభు, మీనా, కౌసల్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా రాజేంద్రన్‌ నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu