»   »  సంగీతకూ ఆ కోరిక ...

సంగీతకూ ఆ కోరిక ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sangeetha
ఇప్పడు హీరోలంతా సిక్స్ పాక్ అంటూంటే హీరోయిన్లు సైజ్ జీరో అంటూ చిక్కిపోతున్న సంగతి తెలిసిందే. నమిత లాంటి బొద్దుగుమ్మలు మాత్రం మేము ఇలా ఉంటేనే అభిమానులకు సంబరం అని చెప్తూ తప్పించుకుంటున్నారు. అయితే సంగీత మాత్రం కాదు నేను ట్రెండునే ఫాలో అవుతానంటూ మరింత నాజూకుగా మారేందుకు రకరకాల కష్టాలు పడుతోంది. ఎన్నో ఇష్టాలను చంపేసికుంటోంది.

ఇక సంగీత మరింత నాజూగ్గా కనిపించేందుకు అందరి హీరోయిన్లు లాగానే వివిధ రకాల అలవాట్లును పాటిస్తోంది. దినచర్యంలో మార్పుచేసుకుందిట. డైటింగ్ చేస్తూ ... ఉపవాసాలూ ఉంటోందిట. దానికి శ్రావణ మాసం సందర్భంగా ఆమె ఏదో వ్రతం చేస్తున్నానంటూ కవరప్ ఇస్తోంది. ఈ మధ్యే "ఇంద్రజిత్" అనే సినిమాలో నటిస్తున్న ఈ అందాల భామ... షూటింగ్‌లో గానీ, బయట ఫంక్షన్లలో గానీ కనీసం గారెలు కూడా తినటం లేదని భోగొట్టా. ఇలాగే ఓ రోజు చికెన్, గారెలు వంటి చక్కని ఫుడ్ ఆమె ముందుంటే.. మనస్సు చంపుకుని మంచినీళ్ళు తాగి కడుపు చల్లార్చుకుందట.

సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా కేక్‌ను కట్ చేశాక ఆమె నోట్లో కేక్‌ ముక్కను పెట్టబోతుంటే.. వద్దని చేత్తో వారించి, తిరిగి ఆయన నోట్లో పెట్టింది. ఏంటీ... ఇందులో నాన్‌వెజ్‌ వుండదు కదా.. అని సాయికుమార్ ప్రశ్నిస్తే... ఇందులోనూ కోడిగుడ్డు ఉంటుంది కదా? అని సమాధాన మిచ్చిందట.

అలా సంగీత మళ్లీ మునపటి గ్లామర్ ని సొంతం చేసుకుని 'పెళ్ళాం ఊరిళితే' నాటి క్రేజ్ సంపాదించాలని తాపత్రయపడుతోంది. అందుకే ఈ తిప్పలన్నీట. తమ తర్వాతి తరం వచ్చేసి పోటీ ఇస్తున్నప్పుడు ఆ మాత్రం భయం ఉండటం సహజమే కానీ ఇలానే ఉంటూ నటన కాస్త నేర్చుకుంటే సమస్యే ఉండదు కదా అనేది కొందరి వాదన.ప్రస్తుతం సంగీత నటన ప్రాధాన్యత గల 'ధనమ్' అనే సినిమాలో చేస్తోంది. అందులో ఆమె దేవదాసి వ్యవస్ధలో పుట్టి ఆ సంప్రదాయన్ని ఎదిరించే ధైర్యంగల అమ్మాయిగా చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X