»   » శృతీ ని పంపించేసి దీపికా వెంట పడుతున్నారు: సంఘమిత్రులు

శృతీ ని పంపించేసి దీపికా వెంట పడుతున్నారు: సంఘమిత్రులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సడన్‌గా సంఘమిత్ర చిత్రం నుంచి శృతిని తప్పిస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఆమెతో ప్రొఫెషనల్‌ ఇబ్బందులు తలెత్తాయని నిర్మాతలు ఆరోపిస్తే, అసలు వారి దగ్గర కథే లేదని, ఎప్పుడు మొదలవుతుందో తెలియని సినిమాకి రెండేళ్లు డేట్స్‌ ఎలా కేటాయిస్తానని శృతిహాసన్‌ అడిగింది.''దురదృష్టవశాత్తూ 'సంఘమిత్ర' నుంచి శ్రుతి తప్పుకున్నారు. అన్నారు...

తప్పుకోవడంపై సుదీర్ఘమైన వివరణ ఇచ్చిన తర్వాత ఎవరూ దాని గురించి మాట్లాడలేదు కానీ.. సంఘమిత్ర పాత్ర ఎవరు చేయనున్నారనే అంశం మాత్రం సస్పెన్స్ గా మిగిలిపోయింది. ఇప్పుడీ రోల్ కోసం అనుష్క.. తమన్నాలతోపాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను కూడా సంప్రదిస్తున్నారనే టాక్ ఉంది.

Sanghamithra Approaches Deepika Padukone

బాహుబలితో క్రేజ్ సంపాదించుకున్న స్వీటీ.. తమ్ము కంటే దీపికాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారట. బడ్జెట్ రీత్యా దీపికా పదుకొనే అయితే.. తమ సినిమాకు వెయిట్ బాగా పెరుగుతుందని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. కానీ సంఘమిత్ర రోల్ చేసేందుకు ఈ బాలీవుడ్ బ్యూటీ ఏ మాత్రం సిద్ధపడుతుందనే విషయం సందేహమే.

Sanghamithra Approaches Deepika Padukone

ఎందుకంటే.. సంఘమిత్ర మూవీ కోసం రెండేళ్ల పాటు టైం కేటాయించాలి. రెండు పార్ట్ లుగా వచ్చినా.. అంత లాంగ్ టైం ఒక్క సినిమాకి దీపిక కేటాయించే ఛాన్సెస్ తక్కువ. సంజయ్ లీలా భన్సాలీ లాంటి టాప్ డైరెక్టర్ రూపొందిస్తున్న పద్మావతి చిత్రానికే దీపిక పట్టుమని 9 నెలలు టైం ఇచ్చింది. అలాంటిది సంఘమిత్ర కోసం రెండేళ్లు.. పైగా షూటింగ్ షెడ్యూల్ లేదని శృతి ఆరోపించిన సినిమాకి అంటే.. కష్టమే కావచ్చు.

English summary
Just as Deepika is set to play Padmavati in Sanjay Leela Bhansali's next, the actress has reportedly been approached for the role of Sanghamithra in Sundar C's grand historical by the same name.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu