»   » రూ. 5 కోట్లు: చుక్కల్లో కమెడియన్ రెమ్యూనరేషన్!

రూ. 5 కోట్లు: చుక్కల్లో కమెడియన్ రెమ్యూనరేషన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తతం కామెడీ లేకుండా ఏ సినిమా కూడా నడవటం లేదు. థియేటర్లకు వెలితే తమను కడుపుబ్బా నవ్వించే సినిమాలకే ప్రేక్షకులు ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కామెడీ యాక్టర్లకు డిమాండ్ బాగా పెరిగి పోయింది. మన తెలుగులో బ్రహ్మానందం లేకుండా స్టార్ హీరోల సినిమాలు ఉండవంటే అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం తెలుగులో బ్రహ్మానందంకు ఉన్న డిమాండ్ మరే నటుడికి లేదు. బ్రహ్మానందం రోజుల లెక్కన రెమ్యూనరేషన్ తీసుకుంటారు. రోజుకు రూ. 5 లక్షల పైమాటే తీసుకుంటారని టాక్. తెలుగులో బ్రహ్మానందంకు ఎంత డిమాండ్ ఉందో తమిళంలో కమెడియన్ సంతానంకు అదే రేంజిలో డిమాండ్ ఉంది.

Santhanam is demanding 5 crores for a 25-day call sheet

తాజాగా సంతానం ఓ సినిమాకు 25 రోజులు డేట్స్ ఇచ్చి రూ. 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. సౌతిండియాలో ఇప్పటి వరకు ఏ కమెడియన్ కూడా ఈ రేంజిలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు. సంతానం లేకుండా తమిళంలో ఏ స్టార్ హీరో కూడా సినిమాలు చేయడం లేదంటే అతనికున్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం తమిళంలో సంతానం క్రేజ్ ఏ రేంజిలో ఉదంటే....సంతానం డేట్స్‌కు అనుగుణంగా సినిమాల షెడ్యూల్స్ తయారు చేస్తున్నారట. సంవత్సరంలో దాదాపు 15 సినిమాల్లో నటించే సంతానం......సగటున రూ. 30 కోట్ల వరకు సంపాదిస్తున్నాడని టాక్. స్టార్ హీరోలతో సమానంగా సంతానం సంపాదన ఉండటం ఇపుడు చర్చనీయాంశం అయింది.

తెలుగులో హిట్టయిన 'మర్యాద రామన్న' తమిళ రీమేక్‌లో హీరోగా నటించిన సంతానం మరో విజయం అందుకున్నాడు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా సంతానం కొంత పెట్టుబడి పెట్టి.....రెమ్యూనరేషన్‌తో పాటు నిర్మాతగా లాభాలు కూడా తన జేబులో వేసుకున్నాడు.

English summary

 Santhanam is the most-wanted comedian in Kollywood today with most of his films having a good run at the box office just for his screen presence and comedy. We hear that Santhanam is demanding 5 crores for a 25-day call sheet and insists on appearing in the film throughout.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu