»   » అపుడు సీక్రెట్‌గా, ఇపుడు అఫీషియల్ గా.... ‘బిచ్చగాడు’ హీరోయిన్ పెళ్లి (ఫోటోస్)

అపుడు సీక్రెట్‌గా, ఇపుడు అఫీషియల్ గా.... ‘బిచ్చగాడు’ హీరోయిన్ పెళ్లి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బిచ్చగాడు' (పిచ్చైక్కారన్) చిత్రంతో విజయ్ ఆంటోని సరసన నటించిన హీరోయిన్ సాట్నా టైటస్ గత సంవత్సరం సెప్టెంబర్లో రహస్యంగా తన ప్రియుడిని రిజిస్టర్ ఆఫీసులో పెళ్లాడినట్లు వార్తలు వచ్చాయి. బిచ్చగాడు చిత్రాన్ని తమిళనాడులో విడుదలైన చేసిన బయ్యర్లలో ఒకరైన కార్తిక్ అనే వ్యక్తితో సాట్నా ప్రేమలో పడింది.

అయితే సాట్నా తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదని, కార్తీక్ తన కూతురిని మాయలో పడేశారని, అతని నుంచి సాట్నాను విడిపించాల్సిందిగా అప్పట్లో ఆమె నడిగర్ సంఘాన్ని ఆశ్రయించినట్లు ప్రచారం జరుగింది. కార్తిక్ మాత్రం తన పెళ్లి ఇరు కుటుంబాల సమ్మతంతోనే జరిగిందని, త్వరలో బహిరంగంగా వివాహం చేసుకుంటామని అప్పట్లో ప్రకటించారు.

కార్తిక్ అపుడు ప్రకటించినట్లుగానే.... ఫిబ్రవరి 6న సేలంలో కార్తిక్-సాట్నా వివాహం చేసుకున్నారు. వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా మీడియాకు రిలీజ్ చేసారు. ఫిబ్రవరి 10న చెన్నైలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది.

 వివాహ వేడుక

వివాహ వేడుక

ఫిబ్రవరి 6న సేలంలో కార్తిక్-సాట్నా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

 సినిమాలకు దూరం

సినిమాలకు దూరం

పెళ్లి తర్వాత సాట్నా సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ‘తిట్టం పోట్టు తిరుడర కూట్టం' చిత్రానికి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్.

 ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

సాట్నా, కార్తిక్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సాట్నా తల్లికి ముందు ఈ పెళ్లికి ఒప్పుకోక పోయినా... తర్వాత అంగీకరించినట్లు సమాచారం.

 బిచ్చగాడు

బిచ్చగాడు

బిచ్చగాడు సినిమా తర్వాత సాట్నాకు హీరోయిన్ గా పలు అవకాశాలు వచ్చినా.... అవన్నీ వదులకుని ప్రేమ వివాహం చేసుకుని సెటిలైంది.

English summary
Bichagadu (Pichaikkaran) fame actress Satna Titus and Distributor Karthick wedding held on Feb 6 in Salem.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X