»   » హీరో సూర్యతో రొమాన్స్ చేయబోతున్న అఖిల్ హీరోయిన్

హీరో సూర్యతో రొమాన్స్ చేయబోతున్న అఖిల్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని యంగ్ హీరో అఖిల్ తొలి చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ దిలీప్ కుమార్ బంధువు సాయేషా సైగల్ ఇపుడు మరో భారీ అవకాశం దక్కించుకుంది. సౌత్ స్టార్ సూర్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, అల్లు శిరీష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అఖిల్ ప్లాప్ తర్వాత సాయేషా అవకాశాల పరంగా వెనకపడింది. హిందీలో అజయ్ దేవగన్‌తో చేసిన భారీ చిత్రం 'శివాయ్' కూడా పరాజయం పాలైంది. దీంతో ఆమె మల్లీ సౌత్ సినిమాల వైపు దృష్టి సారింది. సూర్యతో చేసే సినిమాతో తన కెరీర్ టర్న్ అవుతుందని సాయేషా భావిస్తోందట.

Sayesha Saigal to romance Surya

ప్రస్తుతం సాయేషా సౌగల్ మూడు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. విజయ్ సేతుపతితో కలిసి 'జుంగా' అనే చిత్రంలో, కార్తీ హీరోగా తెరకెక్కుతున్న 'కడైకుట్టి సింగం', ఆర్య సరసన 'గజినీకాంత్' అనే చిత్రంలో సాయేషా నటిస్తోంది.

ఇపుడు సూర్య 37వ చిత్రంలో అవకాశం దక్కడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది ఈ ముంబై బ్యూటీ. వీడొక్క‌డే, బ్ర‌ద‌ర్స్ సినిమాల తర్వాత సూర్య - కె.వి.ఆనంద్ కాంబినేష‌న్లో ఈ చిత్రం రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

English summary
Sayyesha Saigal bagged good opportunities in Tamil. The latest update reveals that Sayyesha has been roped in to play the female lead in Tamil superstar Suriya’s recently announced multi-starrer film in K. V. Anand’s direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X