ఆసుపత్రిలో చేరిన నటి మనోరమ
సినీయర్ నటి మనోరమ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. ఆమెను బుధవారం చెన్నయ్‌లోని సెయింట్ ఇసాబెల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది పడుతోందని, అదే విధంగా కిడ్నీ సంబంధమైన సమస్యల కారణంగా తీవ్రం అనారోగ్యం పాలైందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ఆమె ఐసియులో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, కొన్ని రోజుల ట్రీట్‌మెంట్ అనంతరం కోలుకుంటారని చెప్పారు.
రజనీకాంత్, చిరంజీవి లాంటి హీరోలతో పాటు, ఇతర హీరోలకు తల్లి, బామ్మ పాత్రల్లో మనోరమ నటించారు. అనారోగ్య కారణాల వల్ల చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











