Just In
- 49 min ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 1 hr ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 1 hr ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
- 2 hrs ago
చిత్ర సీమలో విషాదం.. నిర్మాత మృతిపై నారా రోహిత్, సుధీర్ వర్మ ఎమోషనల్
Don't Miss!
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- News
రాహుల్ భయ్యా! మీరు వెకేషన్లో ఉన్నారు: ‘మత్స్యశాఖ’ కామెంట్లపై అమిత్ షా సెటైర్లు
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ దేశంలో పని పూర్తిచేసిన త్రిష.. ఇక మెగాస్టార్స్‌తోనే తరువాయి
ఒకానొక సమయంలో టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది హీరోయిన్ త్రిష. తెలుగు చిత్రసీమలోని అందరు అగ్రహీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో వరుస ఆఫర్స్ పెట్టేస్తూ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తన తాజా సినిమా 'రాంగీ' షూటింగ్ ఫినిష్ చేసుకొని తన పని పూర్తిచేసుకున్నా అని చెబుతోంది.
ఎం. శరవణన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాంగీ' మూవీ షూటింగ్ కోసం రెండు సార్లు ఉబ్జెకిస్తాన్‌కు వెళ్ళింది త్రిష. మొదటిసారి వెళ్లినప్పుడు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను పూర్తిచేసిన చిత్రయూనిట్.. రెండోసారి వెళ్ళినపుడు ఇంకొంత భాగం పూర్తిచేసుకుంది. ఈ మేరకు ఇక తన పని పూర్తయిందని త్రిష పేర్కొంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథ, మాటలు అందించడం విశేషం. సి. సత్య ఈ సినిమాకు సంగీతం అందించారు.

మరోవైపు మలయాళంలో మోహన్‌లాల్ తో కలిసి 'రామ్' చిత్రంతో పాటు, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' (వర్కింగ్ టైటిల్) సినిమాలోనూ నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్ పైకి ఇటీవలే చేరిన త్రిష.. మెగాస్టార్‌తో కలిసి ఓ సాంగ్ షూట్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.