‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ శాలిని పాండే 100%...
అర్జున్ రెడ్డి హీరోయిన్ మరో చాన్స్ దక్కించుకుంది. తమిళంలో ‘100%కాదల్’ సినిమాలో ఎంపికైంది.
Recommended Video

తెలుగు మూవీ 'అర్జున్ రెడ్డి' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన శాలిని పాండే మరో మూవీలో అవకాశం దక్కించుకుంది. తమిళంలో తెరకెక్కుతున్న '100% కాదల్' సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికయింది. ఈ చిత్రంలో తొలుత లావణ్య త్రిపాఠిని అనుకున్నారు. ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం శాలిని పాండేను వరించింది.

జీవి ప్రకాష్, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం చెన్నైలోని ఎవిఎం స్టూడియోలో జరిగింది. తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన '100% లవ్' చిత్రానికి ఇది అపీషియల్ రీమేక్. తమిళంలో ఈచిత్రానికి ఎంఎం చంద్రమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.

'100% కాదల్' ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో నాజర్, అంబిక, సతీష్, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీ సినిమాటోగ్రాఫర్ డుడ్లీ చిత్రం ద్వారా తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ లండన్లో ప్లాన్ చేశారు. 80 శాతం షూటింగ్ అక్కడే జరుగుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











