twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాత్రి వేళ సెల్‌ఫోన్‌లు గుంపుగా.. 2.0 కథ, హాలీవుడ్ సినిమాలన్నీ కాపీనే.. శంకర్!

    |

    దర్శకుడు శంకర్ ఇండియాలోని గొప్ప దర్శకులలో ఒకరు. ఆయన సందేశాత్మక చిత్రాలని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలరు. కమర్షియల్ అంశాలు, భారీ తనంతో కూడా అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించగలరు. శంకర్ ప్రస్తుతం తన మేధస్సుకు పదును పెట్టి 600 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కించిన చిత్రం 2.0. సూపర్ స్టార్ రజనీకాంత్ కథ నాయకుడిగా నటించారు. అక్షయ్ కుమార్ భయంకరమైన ప్రతినాయకుడి పాత్రలో నటించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోల సందడి మొదలవుతుంది. శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2.0 చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    కథ ఎలా మొదలైందంటే

    కథ ఎలా మొదలైందంటే

    సెల్ ఫోన్ల గురించి నా మనలో ఓ ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనే 2.0 చిత్ర కథకు కారణం అని శంకర్ తెలిపారు. రాత్రి సమయంలో వీధిలో సెల్ ఫోన్లన్నీ గుంపులు గుంపులుగా నడుచుకుని వెళుతుంటే ఆ దృశ్యం ఎలా ఉంటుంది అని ఆలోచించాను. ఒక వేళ అలా జరిగితే సెల్ ఫోన్ లు ఎక్కడకు వెళతాయి అంటూ రివర్స్ లో ఆలోచించడం ప్రారంభించాను. అలా 2.0 కథ ని సిద్ధం చేసానని శంకర్ తెలిపారు.

    పరిశోధనలు కూడా

    పరిశోధనలు కూడా

    2.0 కథకు చాలా పరిశోధనలు సహకరించాయి. అనేక పరిశోధనల అంశాలని ఈ చిత్రంలో చూపించాం అని శంకర్ తెలిపారు. ఈ చిత్రంలో విలన్ అక్షయ్ కుమార్ మొబైల్ ఫోన్స్ ని స్వాధీనపరుచుకుని వికృత రూపాల్లోకి మారుతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. మానవాళికి ముప్పుగా మారుతున్న విలన్ కు, చిట్టి రోబోకు జరిగే పోరాటమే 2.0 లో ప్రధాన ఆసక్తికర అంశం. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని త్రీడీలో రూపొందించారు.

    దేశవ్యాప్తంగా 2.0 ఫీవర్.. ముంబైలో 69 అడుగుల రజని విగ్రహం, తెల్లవారు జాము నుంచే!దేశవ్యాప్తంగా 2.0 ఫీవర్.. ముంబైలో 69 అడుగుల రజని విగ్రహం, తెల్లవారు జాము నుంచే!

    బడ్జెట్ మాత్రమే తేడా

    బడ్జెట్ మాత్రమే తేడా

    భారత సినిమా ఇంకా హాలీవుడ్ స్థాయికి చేరుకోలేదనే కామెంట్ పై శంకర్ స్పందించారు. మనకు, హాలీవుడ్ కు కేవలం బడ్జెట్ మాత్రమే తేడా. తగినంత బడ్జెట్ ఉంటే హాలీవుడ్ చిత్రాలని తలదన్నే సినిమాలు తెరకెక్కించవచ్చని శంకర్ తెలిపారు. ఇప్పుడిపుడే మన చిత్రాల స్థాయి కూడా పెరుగుతోందని బాహుబలి, 2.0 చిత్రాలని ఉదహరించారు.

     అవన్నీ కాపీ చిత్రాలే

    అవన్నీ కాపీ చిత్రాలే

    జానపద కథతో సినిమా తెరెక్కిస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రోబో తరువాత అలాంటి కథతోనే తీద్దాం అని అనుకున్నా. కానీ కుదర్లేదు. చరిత్రకు సంబందించిన కథ కానీ, జనపద కథ కానీ తడితే సినిమా చేస్తామని శంకర్ తెలిపారు. మన పురాణాల్లోని ఎన్నో కథలు ఉన్నాయి. గొప్ప గొప్ప హాలీవుడ్ చిత్రాలని గమనిస్తే మన పురాణాల్లోని ఉండే ఎదో ఒక అంశాన్ని కాపీ చేసినట్లుగా అనిపిస్తుంది. కానీ దానిని వాళ్లకు తగ్గట్లుగా మలుచుకున్నారు.

    English summary
    Shankar about Hollywood movies and 2.0 story. 2.0 world wide grand release tomorrow
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X